కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో అడుగుపెట్టి దశాబ్దం పైనే అయ్యింది, కాని ఆమె కోరిక తీరడానికి 10 ఏళ్ళు పట్టింది. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సరసన హీరోయిన్ గా మెరవాలని ఆమె కోరుకోగా అది ఇప్పుడు నెరవేరింది. మధ్యలో ఒకటి రెండు సార్లు ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి జారిపోగా ఈ సారి మాత్రం ఎవరికో వెళ్ళాల్సిన ఆఫర్ ని దక్కించుకుంది కాజల్.
ముందుగా అలియాస్ జానాకీ ఫేం అనీషా అంబ్రోస్ ని హీరోయిన్ గా అనుకున్నా తరువాత మారిన పరిణామాల కారణంగా ఆమె ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు దర్శకుడు బాబీ. దాంతో ఎగిరి గంతేసి ఒప్పేసుకున్న అమ్మడు సినిమా కోసం హద్దులు కూడా దాటేయడానికి ఒప్పుకుందట.
సినిమాలో పల్లెటూరి అమ్మాయి రోల్ చేస్తున్న కాజల్ గ్లామర్ షోతో అదరగొట్టినట్లు సమాచారం. ముఖ్యంగా పాటల్లో అమ్మడు అంగాంగ ప్రదర్శన చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
మే 11 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ మేనరిజం ఎంత అలరిస్తాయో అమ్మడి స్కిన్ షో కూడా అంతే రేంజ్ లో అదరగొడతాయని సమాచారం.
