- Advertisement -

వారి గురించి ప‌ట్టించుకోవ‌ద్దు వ‌రుణ్ తేజ్ ట్వీట్‌

- Advertisement -

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన కాస్టింగ్ కౌచ్ వివాదం తారా స్థాయికి చేరిన వేళ సీని పెద్ద‌లుపై చాలా మంది విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.మ‌రికొంద‌రు ఒక అడుగు ముందుకేసి టాలీవుడ్ టాప్ హీరోల‌పై ఆరోప‌ణ‌లు చేశారు. ఈ క్రమంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈ వివాదంపై మెగా హీరో వ‌రుణ్ తేజ్ స్పందించాడు.‘కపట వేషధారులు, నీపై విమర్శలు చేసి నిన్ను నేలకీడ్చాలని చూసేవాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అవతలి వాళ్లను చెడ్డొళ్లను చేయాలన్న వాళ్ల ప్రయత్నం సులువైందే కావొచ్చు.

కానీ, అలా చేసేముందు వాళ్లను వాళ్లు ఓసారి అద్దంలో చూసుకుంటే మంచిది’ అంటూ వరుణ్‌ తేజ్‌ ఓ ట్వీట్‌ చేశాడు.వ‌రుణ్ చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.త‌న బాబాయ్ ప‌వ‌న్ మీద చేసిన కామెంట్స్‌కి రియాక్ట్ అయ్యాడా! లేక క‌త్తి మ‌హేష్ త‌న పెద‌నాన్న ప్రోడ‌క్ష‌న్ మీద కేసు పెడ‌తాను అన్న దాని మీద రియాక్ట్ అయ్యాడో మెగా అభిమానుల‌కు అర్థం కావ‌డం లేదు.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -