Tuesday, May 14, 2024
- Advertisement -

ఒకప్పటి లవర్ బాయ్, ఆ మెగా హీరోల బాగోతాలు కూడా త్వరలో బయటపడతాయా?

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో ఉండే క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం గురించి రోజుకో సెలబ్రిటీకి సంబంధించిన బాగోతం బయటపడుతూ ఉంది. అయితే క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు మన హీరోలకు హీరోయిన్స్‌ జీవితాలను ప్రేమ పేరుతో ఆడుకోవడం కూడా బాగా అలవాటు. పరాయి భాషల నుంచి వచ్చే హీరోయిన్స్‌తో పాటు ఇక్కడ స్థానిక హీరోయిన్స్‌కి కూడా సినిమా ఇండస్ట్రీలో ఎవరో ఒక హీరో అండ దొరికితే కాస్త సెక్యూర్డ్‌గా ఫీలవుతారు.

అయితే మన హీరోలు మాత్రం ఆయా హీరోయన్స్‌ని మోజున్నంత కాలం ప్రేమ పేరుతో హింసించడం…..ఆ తర్వాత రివేంజ్ తీర్చుకునే స్థాయిలో ఆ హీరోయిన్స్ కెరీర్‌కి నష్టం చేసేలా చేయడం అలవాటే. తెలుగు హీరోయిన్ ప్రత్యూషకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుందని చాలా మంది భావించారు. అయితే ప్రేమ నాటకాలతో ప్రత్యూష జీవితాన్ని బలిచేశారు. ఇక ఆర్తీ అగర్వాల్ కథ కూడా సేం టు సేం. అలాగే ఒక మెగా హీరో కూడా ఈ మధ్య కాలం వరకూ ఈ తరం యంగ్ హీరోయిన్‌తో ప్రేమాయణం నడిపాడు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ పూర్తిగా దూరం పెట్టేశాడు. మెగా హీరోయిన్ అన్న ముద్రపడితే నాలుగు అవకాశాలు వస్తాయనుకున్న ఆ హీరోయిన్‌కి ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలే రాకుండా చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ కథలు, కథల వెనుక గూడుపుఠానీలు బయటపడితే భవిష్యత్‌లో అయినా హీరోలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. ముందు ముందు ఇంకా ఎన్ని బాగోతాలు బయటపడతాయో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -