Wednesday, May 1, 2024
- Advertisement -

ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడితే ఊరుకొనేది లేదు…జీవిత

- Advertisement -

ఇటీవల కాస్టింగ్‌ కౌచ్‌పై మహిళా సంఘ నేత సంధ్య ఓ చానల్‌లో మాట్లాడుతూ జీవితా రాజశేఖర్‌పై ఆరోపణలు చేశారు. దీనిపై జీవిత స్పందించారు. టీవీల్లో డిబేట్లు పెట్టి సెలబ్రిటీల గురించి మాట్లాడితే తాను ఇక ఊరుకోనని సంధ్య‌కు ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నారు..? మిమ్మ‌ల్ని అడిగే వాళ్లులేరా…? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఎవ్వ‌రూ ఉరుకోరంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నాపై చేసిన ఆరోపణలకు సమాధానం వచ్చేవరకు ఊరుకోనుస అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

శ్రీరెడ్డి విషయంలో ఏం న్యాయం జరిగిందో నాకు అర్థం కావడం లేదని జీవిత రాజశేఖర్ అన్నారు. ఎందుకు మీ అమ్మాయిని సినిమాల్లో నటింపజేస్తున్నారని నిలదీసే పరిస్థితికి వచ్చిందన్నారు. శ్రీరెడ్డికి సినిమాల్లో అవకాశాలు ఎలా ఇస్తారని ఆమె వ్యాఖ్యానించారు. సినీ పరిశ్రమలో తప్పులు జరగడం లేదని నేను అనడం లేదు. అన్ని రంగాల్లో మహిళలపై వివక్ష జరుగుతూనే ఉందని చెప్పారు. పరిశ్రమలో వివాదాలు తలెత్తినప్పుడు చర్యలు తీసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు.

శ్రీరెడ్డికి టీవీల్లో అంతగా ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? సినిమాలో పాత్రలు ఎలా ఇస్తారు? ఒక సినిమా తీయాలంటే ఎంతగా ఖర్చు చేయాలో, ఎంతగా కష్టపడాలో నాకు తెలుసు. ఎటువంటి ఆర్టిస్టులను తమ సినిమాల్లో పెట్టుకోవాలో ప్రొడ్యూసర్లు, దర్శకులు ఎంతగానో ఆలోచిస్తారు. టీవీల్లో వస్తోన్న న్యూస్‌లను చూసి ఎవరో చెప్పింది విని అదంతా నిజమని నమ్మొద్దు. ఒకరు బాగా నటించగలరు అనుకుంటే వారికి అవకాశం ఇస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -