శ్రుతి హాసన్ మోస్ట్ టాలెంట్ పర్సన్‌గా పరిచియమైన ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. తండ్రి కమల్ హాసన్ కుతురుగా పరిచియమైనా తనకంటు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.తెలుగు , తమిళ్ భాషలలో హీరోయిన్గా చేసింది. అగ్ర హీరోలందరితో పని చేసింది.హీరోయిన్గా మంచి జోష్‌లో ఉన్నప్పుడే సినిమాలు తగ్గించేసింది.కొన్ని సినిమాల నుండి శ్రుతిని తప్పించడం కూడా జరిగింది.చాలాకాలం నుండి సినిమాలు లేక ఖాళీగా ఉంది. బాలీవుడ్ మోజులో కెరీర్‌ను పాడు చేసుకుందని చాలామంది అభిప్రాయం.
శ్రుతి ఇన్నాళ్లూ సినిమాలకు ఒప్పుకోకపోవడానికి కారణం తన ప్రియుడు మైఖేల్ కోర్సెల్‌తో వివాహం నిశ్చయమవడమేనని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.ఎట్టకేలకు శృతి మరో సినిమా ఒప్పుకుంది. మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో శ్రుతి నటించబోతున్నారు. ఇందులో శ్రుతికి జోడీగా విద్యుత్ జమ్వాల్ నటించనున్నారు.గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోందని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ముంబయిలో సినిమా చిత్రీకరణ ఈరోజే మొదలైంది. విజయ్ గలానీ, ప్రతీక్ గలానీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.