- Advertisement -

రజనీ ‘కాలా’ రిలీజ్ డేట్ ఫిక్స్‌

- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజా చిత్రం ‘కాలా’ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుంది.కాని విడుద‌ల‌కు మాత్రం నోచుకొవ‌డం లేదు.తమిళ చిత్రపరిశ్రమ బంద్ కారణంగా విడుదల వాయిదా ప‌డుతువ‌స్తుంది. మొద‌ట ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుద‌ల చేస్తార‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించారు. ఇప్పుడు కాలా సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. జూన్ 7వ తేదీన విడుద‌ల కానుంది ర‌జ‌ని కాలా. కాలా సినిమా వ‌ల్ల తెలుగులో కూడా వాయిదాలు వేసుకున్న సినిమాలు కొన్ని అయితే ముందుకు జ‌రిగిన సినిమాలు కొన్ని.

మహేష్ బాబు న‌టించిన సినిమా ‘భర‌త్ అను నేను’ సినిమా మొద‌ట ఏప్రిల్ 27న విడుద‌ల తేదిని ఫిక్స్ చేశారు. అదే రోజున అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ సినిమా కూడా విడుద‌ల‌కు రెడీ అని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కాని ఇన్ని పెద్ద సినిమాలు ఒకే రోజు వ‌స్తే క‌లెక్ష‌న్స్ మీద ప్ర‌భావం ప‌డుతుంద‌ని భావించి చిత్ర నిర్మాతలు మ‌హేష్ సినిమా ఏప్రిల్ 20న, ర‌జ‌నికాంత్ సినిమా ఏప్రిల్ 27న, అల్లు అర్జున్ సినిమా మే4న విడుద‌ల చేయ‌డానికి ఒప్పందాలు కుద‌ర్చుకున్నారు. పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో ముంబై మురికివాడల నేపథ్యంలో ‘కాలా’ సినిమా రూపొందింది. ఈ సినిమాలో రజనీకాంత్ ‘కరికాలన్’ అనే గ్యాంగ్ స్టర్ పాత్ర పోషించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -