Wednesday, May 15, 2024
- Advertisement -

రాజ‌స్థాన్ రాయల్స్‌  ఘోర ఓట‌మికి స్వీయ కార‌ణాలు ఇవే …

- Advertisement -

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 64 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 205 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ 18.3 ఓవర్లలో 140 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం చెందింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది.

చెన్నై సూపర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చిత్తుగా ఓడిన సంగ‌తి తెలిసిందే. మ్యాచ్‌లో రాజ‌స్థాన్ రాల్స్ స్వీయ త‌ప్పిదాల కార‌నంగానే ఓట‌మి చ‌విచూసింది. చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించిన షేన్ వాట్సన్ (106 : 57 బంతుల్లో 9×4, 6×6) మ్యాచ్ ఆరంభంలోనే ఇచ్చిన రెండు క్యాచ్‌ల‌ను జారవిడిచిన రాజస్థాన్.. ఆ తర్వాత సురేశ్ రైనా(46: 29 బంతుల్లో 9×4)ను రనౌట్‌ చేసే అవకాశాన్ని కూడా పేలవ రీతిలో చేజార్చుకుంది. దీంతో.. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది

లక్ష్య ఛేదనలోనూ రాజస్థాన్‌ జట్టు దొరికిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. ఓపెనర్ క్లాసెన్‌(7)కి తొలి ఓవర్‌లోనే ఓ జీవనదానం లభించినా.. అతను వినియోగించుకోలేకపోయాడు. ఆరంభంలోనే వికెట్ పడినా.. తర్వాత వచ్చిన సంజు శాంసన్ (2) బాధ్యతాయుతంగా ఆడకుండా.. పేలవ రీతిలో వికెట్ చేజార్చుకున్నాడు.

పేలవ ఫీల్డింగ్‌తో పాటు లయ తప్పిన బౌలింగ్‌ కారణంగా తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్న రాజస్థాన్ జట్టు.. అనంతరం భారీ లక్ష్యఛేదనలో ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఈ టోర్నీలో 200+ ఉన్న టార్గెట్‌ని కూడా ఛేదించిన జట్లు ఉన్నాయి. కాని ఇన్ని త‌ప్పిదాల కార‌నంగానే రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఓట‌మి చెందింద‌నే చెప్ప‌వ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -