తెలుగు సినిమాలు ఒకప్పుడు థియేట్రికల్ రన్ ని బట్టి హిట్టా ఫట్టా అని తెల్చేవారు, ఒక సినిమా 100 రోజులు ఆడితే హిట్ అని 150 రోజులు ఆడితే సూపర్ హిట్ అని 175 రోజులాడితే బ్లాక్ బస్టర్ అని పిలిచేవారు. కాని మారుతున్న కాలాన్ని బట్టి ఇప్పుడు సినిమాలు మరీ అన్ని రోజులు కాకున్నా ఎప్పుడో ఒకటి రెండు సినిమాలు అయినా 100 రోజుల వేడుకను జరుపుకుంటున్నాయి.
ఇక 150 రోజుల సినిమాలు మాత్రం గత 5 ఏళ్లలో తక్కువగానే చూశాము. భారీ రికార్డులు సాధించిన బాహుబలి కూడా 150 రోజుల వేడుకను జరుపుకోలేదు. అలాంటిది 2014 వచ్చిన బాలకృష్ణ లెజెండ్ సినిమా ఇప్పటికీ ఎమ్మిగనూడులో 800 లరోజులకి పైగా ఆడుతూ రికార్డు నెలకొల్పగా ఇప్పుడు మహేష్ బాబు శ్రీమంతుడు కూడా ఓ రేర్ రికార్డును సొంతం చేసుకుంది.
లెజెండ్ తరువాత విడుదల అయిన ఏ సినిమా 150 రోజులు ఏ థియేటర్లో ఆడలేదు. అలాంటిది ఈ మధ్యనే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు ఎమ్మిగనూడులోని లక్ష్మణ్ థియేటర్ లో 150 రోజులాడి ఈ రికార్డును లెజెండ్ తరువాత అందుకున్న రెండవ సినిమాగా ఆల్ టైం రికార్డును సొంతం చేసుకుంది.
