Sunday, April 28, 2024
- Advertisement -

దేవీ శ్రీ ప్రసాద్ – సమంత లని కలపాలని .. సుకుమార్ ప్రయత్నం

- Advertisement -

తెలుగు సినిమాలో దాదాపు ఒక హీరోకి ఉన్నంత ఫాలోయింగ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్. తన ‘డీఎస్పీ’ అనే బ్రాండ్ తో దక్షిణ భారతదేశ సినిమా చరిత్రలో ఆయన భారీ సంచలనం సృష్టిస్తున్నాడు. త్వరలో వెండితెర మీద కూడా అరంగేట్రం చెయ్యబోతున్న విషయం తెలిసిందే. తను హీరోగా అవ్వాలని ఉవ్విళ్ళు ఊరుతున్నాడు దేవీ శ్రీ ప్రసాద్, కానీ ఆయన దూకుడు వెనక ఒక వ్యక్తి ప్రేరణ ఉంది.

దేవీని దారి మళ్ళించి మరీ హీరోగా తెరమీద చూపించే ప్రయత్నం వెనకాల సుకుమార్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుస్తోంది. వీరిద్దరి మధ్యనా ఉన్న ఫ్రెండ్ షిప్ సంగతి చెప్పనక్కర లేదు. సుక్కూ కోసం ప్రతీ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఇచ్చి మరీ తన స్నేహాన్ని చూపించే దేవీ సుకుమార్ కొత్త సినిమా కుమారీ 21 ఎఫ్ సినిమా కోసం రూపాయి కూడా తీసుకోకుండా సంగీతం ఇచ్చాడు.

దేవీ కళ్ళలో ఆనందం కోసం సుకుమార్ స్వయంగా కలం పట్టాడు ఇప్పుడు. కొత్త డైరెక్టర్ తో కానీ అవసరమైతే తానే డైరెక్టర్ గా దేవీని హీరో చెయ్యాలని ముచ్చట పడుతున్నాడు. రాక్ స్టార్ లాంటి దేవీ పక్కన సమంత అయితే హీరోయిన్ గా బాగుంటుంది అనీ ఆమె కోసం సుకుమార్ స్వయంగా సంప్రదింపులు జరుపుతున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -