- Advertisement -
టాలీవుడ్ తాజా వివాదం కాస్టింగ్ కౌచ్‌పై ఒకప్పటి హీరోయిన్ అనిత స్పందించారు.నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లో అవకాశాల కోసం పడుకొవలని , ఇక్కడ పడుకున్నవారికే అవకాశాలు ఇస్తారని సంచలన ఆరోపణలు చేసింది. ఈ వివాదంపై స్పందించిన అనిత తాను హీరోయిన్ గా చేసిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని గుర్తు చేసుకుంది.
ఇప్పుడు కొంత ఫర్వాలేదని చెప్పింది. కాస్టింగ్ కౌచ్ నుంచి తప్పించుకోవాలంటే అమ్మాయిలు చాకచక్యాన్ని చూపాలని సలహా ఇచ్చింది. ‘నువ్వు నేను సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనిత తరువాత కొన్ని సినిమాలలో హీరోయిన్‌గా మెరిసింది. అనిత ప్రస్తుతం హిందీ సీరియల్స్ లో రాణిస్తూ ‘నాగిన్-3’ టీవీ షో చేస్తుంది.
