మెగా పవర్ స్టార్ సినిమా షూటింగ్…….. మాస్ కథలను భారీగా తెరకెక్కించే డైరెక్టర్ బోయపాటి శ్రీను……. వందల మందితో షూటింగ్ జరుగుతోంది……… అయితే అనుకోని సూపర్ ట్విస్ట్ ఎదురైంది. ఇది బోయపాటి మార్క్ సినిమాల్లో కనిపించే ట్విస్టే. కానీ బోయపాటి సినిమాల్లో వచ్చే ట్విస్ట్ సినిమాను మరింత ఆసక్తికరంగా మారిస్తే ఇక్కడొచ్చిన ట్విస్ట్ మాత్రం ఏకంగా సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడేలా చేసింది.
టాలీవుడ్లో ఇప్పుడు లైట్‌మెన్‌కి ఇచ్చే జీతాల విషయంలో గొడవ గొడవ జరుగుతోంది. చాలా చిన్న సినిమాల షూటింగ్స్ని ఆపేస్తూ ఉన్నారు. అయితే పెద్ద సినిమాల విషయంలో మాత్రం ఇప్పటి వరకూ చూసీ చూడనట్టుగా పోయారు. కానీ చిన్న సినిమాల షూటింగ్స్‌కి ఎన్ని బ్రేకులు పడేలా చేసినా ఇండస్ట్రీ పెద్దల నుంచి మాత్రం స్పందన రాలేదు. అందుకే ఇంకాస్త దూకుడుగా వెళ్ళాలనుకున్న లైట్‌మెన్ అసోసియేషన్ మెంబర్స్ ఇఫ్పుడు పెద్ద సినిమాల షూటింగ్స్ని కూడా అడ్డుకుంటున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న రామ్ చరణ్ సినిమా షూటింగ్‌ని అడ్డుకున్నారు. హీరో రామ్ చరణ్ సమక్షంలోనే రచ్చ రచ్చ చేశారు. గొడవ చేస్తున్న వాళ్ళను సముదాయించడానికి యూనిట్ మెంబర్స్ ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళు మాత్రం ససేమిరా అన్నారు. దాంతో చేసేదిలేక షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసి రామ్ చరణ్‌తో సహా సినిమా జనాలందరూ కూడా లొకేషన్ నుంచి వెళ్ళిపోయారు. భారీ సినిమాల షూటింగ్ ఒక్క రోజు ఆగినా లక్షల్లో నష్టం వస్తుంది. ఈ సమస్య ఇంకా ముదిరిపోయి ఇతర పెద్ద సినిమాలపై కూడా ప్రభావం పడకముందే ఇండస్ట్రీ పెద్దలందరూ సరైన పరిష్కారం కనుక్కుంటారేమో చూడాలి మరి.
