Friday, May 17, 2024
- Advertisement -

టాస్ గెలిచి ఫీల్డింగ్‌ను ఎంచుక‌న్న కింగ్స్ లెవెన్ పంజాబ్‌

- Advertisement -

ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే ఓసారి ఈ రెండు జట్లూ ఢీకొనగా.. ఆ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 15 పరుగుల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది.

హ్యాట్రిక్ విజయాలతో టోర్నీని ఆరంభించిన హైదరాబాద్ జట్టు.. రెండు వరుస ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై అనూహ్య విజయంతో మళ్లీ జోరందుకుంది. ఆ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌లు ఘోరంగా విఫలమైనా.. బౌలింగ్‌తో 118 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ అద్భుతరీతిలో కాపాడుకుంది. సొంత మైదానం ఉప్పల్‌లో ఈ మ్యాచ్‌ జరుగుతుండటం హైదరాబాద్‌కి కలిసొచ్చే అంశం.

పంజాబ్ తుది జట్టులో రెండు మార్పులు జరిగాయి. అనారోగ్యంతో ఢిల్లీతో మ్యాచ్‌కి దూరమైన క్రిస్‌గేల్ ఫిటెనెస్ సాధించి మళ్లీ తుది జట్టులోకి రాగా.. టోర్నీ ఆరంభం నుంచి విఫలమవుతున్న యువరాజ్ సింగ్‌పై వేటు పడింది. అతని స్థానంలో మనోజ్ తివారీని పంజాబ్ జట్టులోకి తీసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది.

హైదరాబాద్ జట్టు: శిఖర్ ధావన్, కేన్ విలియమ్సన్, సాహా, మనీశ్ పాండే, షకిబ్ అల్ హసన్, యూసఫ్ పఠాన్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, బసిల్ థంపీ, సిద్ధార్థ కౌల్, సందీప్ శర్మ

పంజాబ్ జట్టు: కేఎల్ రాహుల్, క్రిస్‌గేల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, అరోన్ ఫించ్, మనోజ్ తివారి, రవిచంద్రన్ అశ్విన్, ఆండ్రూ టై, బరిందర్ శరణ్, అంకిత్ రాజ్‌పుత్, అంకిత్ రాజ్‌పుత్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ .

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -