గ‌ల్లాకు జ‌న‌సేన‌ ట్విట్టర్‌ కౌంటర్

వైసీపీ అధినేత జగన్మోహన్‌ రెడ్డితో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ విమ‌ర్శ‌ల‌కు జ‌న‌సేన స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. రెండు రోజుల క్రితం ట్వీట్ చేస్తూ మోదీ- షా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో జగన్, పవన్ టైటిల్‌తో కొత్త సినిమాకి రాబోతుందని పేర్కొన్నారు.

గల్లా జయదేవ్ వ్యాఖ్యలపై స్పందించిన జనసేన పార్టీ తమ స్పందనను ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలుపుతూ చురకలంటించింది. అలాగే మోదీ సినిమాలో జగన్, పవన్ నటన అద్భుతమని… హోదా విషయంలో వారిద్దరూ మోదీని ఎందుకు ప్రశ్నించరంటూ ఇవాళ మళ్లీ టార్గెట్ చేశారు. దీంతో కౌంటర్‌గా జనసేన ప్రకటనను విడుదల చేసింది.

వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ లా ఒక్క రోజు లోక్‌సభలో స్పెషల్ స్టేటస్‌పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారు… మీ మౌనం వెనుక కారణం ఏమిటో రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు తెలుసు సార్… కొత్త సినిమా, కథ, డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్త ఆలోచించండి మాష్టారంటూ ప్రకటన చేశారు.