Saturday, May 18, 2024
- Advertisement -

పుట్టిన వెంట‌నే అధార్ నెంబ‌ర్ పొంది రికార్డు సృష్టించిన పాప‌

- Advertisement -

ప్ర‌స్తుతం దేశంలో అన్నింటికీ ఆధార్ త‌ప్ప‌ని స‌రిఅయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు, బ్యాంకింగ్‌, ఇత‌ర సేవ‌ల‌కు కేంద్రం ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది. చిన్న పిల్లలకు కూడా ఆధార్‌ కార్డు ఉండాల్సిందే. చిన్నారులకు ఆధార్‌ కార్డు ఇవ్వడానికి ఆధార్ ప్రాధికారత సంస్థ(యూఐడీఏఐ) ఇప్పటికే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఐదేళ్ల లోపు చిన్నారులకు బాల ఆధార్ కార్డు అందిస్తోంది.

మహారాష్ట్రలోని ఖామ్‌గావ్‌లోని ఓ ఆసుపత్రిలో ఇటీవల పుట్టిన ఓ పాప.. జన్మించిన 1.48 నిమిషాల్లోనే ఆధార్‌ కార్డు పొంది అతి తక్కువ సమయంలో ఆ కార్డు పొందిన రికార్డు నెలకొల్పింది. ఆ పాపకు సాచి అని పేరు పెట్టారు. తనకు బిడ్డ పుట్టగానే ఆధార్‌ కార్డు తీసుకుని రికార్డు నెలకొల్పాలని ముందుగానే నిర్ణయించుకున్న సాచి తండ్రి అందు కోసం తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -