- Advertisement -
ఐపీఎల్ 2018 సీజన్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో శుక్రవారం జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన ఢిల్లీ జట్టు ఐదు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో చివరి స్థానానికే పరిమితమవగా.. మూడింట్లో గెలుపొందిన కోల్‌కతా జట్టు నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఢిల్లీ జట్టు వరుస ఓటములకి బాధ్యత వహిస్తూ బుధవారం కెప్టెన్సీ బాధ్యతల నుంచి గౌతమ్ గంభీర్ తప్పుకోగా.. యువ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌కి నాయకత్వ బాధ్యతల్ని ఢిల్లీ ఫ్రాంఛైజీ అప్పగించింది. ఇప్పటికైనా ఢిల్లీ డేర్‌డేవిల్స్ తలరాత మారుతుందో చూడాలి.
