కేన్స్‌లో మ‌తి పోగొడుతున్న దీపిక

ఫ్రాన్స్‌లో 71వ కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది. మే 8 నుంచి 19వరకు ఈ వేడుక జరగబోతోంది. ఈ వేడుకలో దీపిక పదుకొణె త‌ళ్లుకున మెరిసింది.పొడవాటి తెలుపు రంగు గౌనులో అందరి చూపును తనవైపునకు తిప్పుకున్నారు. గౌనుకు సరిపోయేలా వజ్రాలు పొదిగిన కమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

కేన్స్‌ జ్యూరీ సభ్యురాలిగా, ప్రముఖ ఫ్రెంచ్‌ బ్రాండ్‌ లారియల్‌కు ఐష్‌ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు.ఇటీవల వివాహం చేసుకున్న సోనమ్‌ కపూర్‌ కూడా కేన్స్‌కు హాజరుకానున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. బాలీవుడ్‌ నటులు హ్యూమా ఖురేషీ, నవాజుద్దీన్‌ సిద్ధిఖి, మల్లికా శెరావత్, తమిళ నటుడు ధనుష్‌ కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

https://instagram.com/p/BimgR_LBTVk/?utm_source=ig_embed