Thursday, May 2, 2024
- Advertisement -

వామ్మో… అవి నోట్ల‌క‌ట్ట‌లా… పుస్త‌కాలా… !

- Advertisement -

ప్ర‌ధాన బ్యాంకు శాఖ‌నుంచి డ‌బ్బును బ్యాంకుల‌కు త‌ర‌లించాలంటే ప‌క‌డ్బందీ సెక్కూరిటీ మ‌ధ్య త‌ర‌లిస్తారు. కాని మాత్రం ఎటువంటి ర‌క్ష‌ణ లేకుండా ఓపెన్ ట్రాలీలో రూ.40 కోట్ల న‌గ‌దును త‌ర‌లించిన సంఘ‌ట‌న న‌ల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.

రైతు బంధు పథకం కోసం నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచీలో భారీగా డబ్బు దాచి పెట్టారు. జిల్లాలోని అన్ని బ్యాంకులకు ఇక్కడి నుంచే డబ్బు తరలించ‌డానికి పూనుకున్నారు. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన కొందరు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో సీఐ, ఎస్ఐ తదితరులు రంగంలోకి దిగారు. ఇంత భారీగా నగదును సెక్యూరిటీ లేకుండా ఎలా పంపుతున్నారని నిలదీశారు.

నగరంలోని మరో ప్రాంతానికే అయినా, సెక్యూరిటీ లేకుండా పంపడం సరికాదని, తమకు సమాచారం ఇవ్వాల్సి వుందని అన్నారు. ఆపై సెక్యూరిటీని ఏర్పాటు చేసి డబ్బును తరలించారు.

ఈ సంఘ‌ట‌న‌పై బ్యాంకు అధికారులు వివ‌ర‌ణ ఇచ్చారు. తమ దగ్గర క్యాష్ వ్యాన్ లేకపోవడంతో ఇలా చేయాల్సి వచ్చిందని ఏపీజీవీబీ బ్రాంచ్ మేనేజర్ మధు వివరణ ఇచ్చారు. భారీ మొత్తంలో నగదును హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేప్పుడు మాత్రమే క్యాష్ వ్యాన్ వాడతాం. నగదు పంపిణీ ఆలస్యం కాకుండా ఉండటం కోసం ఇలా చేశామని మధు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -