- Advertisement -

చరణ్-బోయపాటి ఫిల్మ్ హిందీ డబ్బింగ్ రైట్స్……. బిగ్గెస్ట్ ఎవర్

- Advertisement -

రంగస్థలం సినిమా గ్రాస్ దాదాపు 200 కోట్ల రేంజ్‌లో నిలబడడంతో చరణ్ సూపర్ ఫాంలోకి వచ్చాడు. రంగస్థలం సినిమాకు ముందు వరకూ చరణ్ కెరీర్ గ్రోత్ అనుకున్నట్టుగా సాగలేదు. మగధీరతో డబుల్ మార్జిన్‌లో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన చరణ్ ఆ తర్వాత అదే ఊపు కొనసాగించలేకపోయాడు. ఇక బ్రూస్ లీ లాంటి సినిమాలతో పూర్తిగా డీలా పడిపోయాడు. అయితే సుకుమార్ హార్డ్ వర్క్, సూపర్బ్ డైరెక్షన్‌తో పాటు చరణ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కూడా కలిసొచ్చి రంగస్థలం సినిమా నాన్ బాహుబలి రికార్డ్స్ కొట్టేసింది.

ఇప్పుడు ఆ రంగస్థలం ఎఫెక్ట్ రాబోయే బోయపాటి శ్రీను, రామ్ చరణ్‌ల సినిమా బిజినెస్‌లో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సూపర్ క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబేరాయ్ నుంచీ తెలుగు హీరో శ్రీకాంత్ వరకూ ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. ఇక రంగస్థలం ఇచ్చిన కాన్ఫిడెన్స్‌తో ఈ సారి రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కూడా పీక్స్‌లో ఉండడం ఖాయం. అందుకే సినిమాపైన ట్రేడ్ వర్గాలు భారీ అంచనాలు పెంచుకున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా బాలీవుడ్ రైట్స్ దాదాపు 21 కోట్లకు నార్త్ ఇండియాకు చెందిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేసింది. ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ప్రైస్. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఓవర్సీస్ రైట్స్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా ఇదే రేంజ్‌లో అమ్ముడుపోవడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే మాత్రం చరణ్ కెరీర్ బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిల్మ్ ఇదే అవుతుందనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -