Monday, April 29, 2024
- Advertisement -

బాబుకు సూపర్ షాక్…. చిత్తూరు జిల్లాలో వైకాపాలో చేరిన టిడిపి నాయకులు

- Advertisement -

ముఖ్యమంత్రి హోదాలో టిడిపి అధినేత చంద్రబాబు 2019లో కూడా టిడిపినే అధికారంలోకి వస్తుందని పదే పదే చెప్తూ ఉన్నాడు. మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపి స్థానాలు గెలుస్తాం అని చెప్తున్నాడు. అయితే టిడిపి అధినేత మాటలను ఆయన సొంత పార్టీ నేతలే నమ్మడం లేదా? అది కూడా చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు టిడిపి నేతలే వైకాపాలో చేరడానికి ఉత్సాహం చూపిస్తుండడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఎన్నికల సర్వేలన్నీ 2019 ఎన్నికల్లో వైకాపాదే గెలుపు అని తేల్చేస్తున్నాయి. కాంగ్రెస్, బిజెపి నాయకులు కూడా వైకాపాలో చేరడానికి ఉవ్విళ్ళూరుతున్నారు.

అన్నింటికంటే ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే అధికారంలో ఉన్న టిడిపి పార్టీని వదిలి ఆ పార్టీ నాయకులు వైకాపాలో చేరుతూ ఉండడం. 2019లో చిత్తూరులో స్వీప్ చేస్తాం అనే రేంజ్‌లో చంద్రబాబు మాట్లాడుతుంటే ఆ పార్టీ నాయకులు మాత్రం వరుసగా వైకాపాలో చేరడానికి క్యూ కడుతున్నారు. తాజాగా తిరుపతి నియోజకవర్గం టిడిపి నాయకులు శ్రీకాంత్, సాయిబాబా, గంగాధర్‌లు వైకాపా కండువా కప్పుకున్నారు. వైసీపీ ఇన్‌ఛార్జ్ నాయకుడు ద్వారకానాథ్‌రెడ్డి సమక్షంలో ఈ టిడిపి నాయకులు వైకాపాలో చేరారు. చంద్రబాబును నమ్ముకన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, నాయకులు అందరూ కూడా అథోగతి పాలయ్యారని, నమ్మకద్రోహానికి నిలువెత్తురూపం చంద్రబాబేనని…….వైఎస్‌లు విశ్వసనీయతకు మారుపేరని వైకాపాలో చేరిన ఆ టిడిపి నాయకులు చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో చిత్తూరులో వైకాపా గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని ఆ నాయకులు చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -