Wednesday, May 15, 2024
- Advertisement -

ఎవడికైనా చెప్పుదెబ్బలే: శ్రీరెడ్డి

- Advertisement -

టాలీవుడ్ తాజా సంచ‌ల‌న న‌టి శ్రీరెడ్డి మ‌రో సంచ‌లన వీడియో త‌న ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.వీడియోతొ పాటు రెండు మూడు ఘాటు వాఖ్య‌లు కూడా చేసింది.‘సినిమా ఇండస్ట్రీలో ఉన్న వెధవల్లారా.. జరభద్రం, ఖబడ్దార్ ఎవడికైనా చెప్పుదెబ్బలు తప్పవు’ అంటూ ఘాటుగా తనదైన శైలిలో హెచ్చరించింది. అస‌లు విష‌యం ఏమిటంటే శ్రీశాంత్ రెడ్డి అనే అత‌ను సినిమాల‌కు ఆర్టిస్ట్‌ల‌ను స‌మ‌కుర్చుతుంటాడు.ఈ తరుణంలో బాధిత మహిళా ఆర్టిస్ట్‌తో పరిచయం ఏర్పడింది.

ఆమెను ప్రేమ, పెళ్లి అంటూ మాయ మాటలు చెప్పి తన రూంకి పిలుపించుకుని డ్రింక్‌లో మత్తుమందుకలిపి ఆమెతో లైంగిక వాంఛలను తీర్చుకున్నాడు.ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని చెప్పి ఆమె ద‌గ్గ‌ర ఉన్న బంగారం మొత్తం తీసుకుని త‌న అవ‌స‌రాల‌ను తీర్చుకున్నాడు. పెళ్లి అని అడిగితే మాత్రం మొహం చాటేస్తుండ‌టంతో భాధితురాలు న‌టి శ్రీరెడ్డి స‌హాయంతో పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయ‌డానికి వెళ్లింది.వీరి కంటే ముందే అక్క‌డకు చేరుకున్న శ్రీశాంత్ రెడ్డి త‌న ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగించేలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఫిర్యాదు చేయ‌డానికి అదే పోలీస్ సేష్ట‌న్‌కు వచ్చాడు.

ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళా ఆర్టిస్ట్ మహిళా సంఘాలు అండ్ శ్రీరెడ్డి బ్యాచ్‌తో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తనను మోసం చేసిన కోఆర్డినేటర్‌ను పోలీసుల ముందే వీరకుమ్ముడు కుమ్మేసింది. అందరూ చూస్తుండగానే చెప్పుదెబ్బలతో విరుచుకుపడింది. అక్కడ జరిగిన తతంగాన్ని వీడియో తీసిన శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ద్వారా ఆ వీడియోను పోస్ట్ చేసింది.

https://www.facebook.com/iamsrireddy/videos/2106805609566360/

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -