పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మధ్య ఈ సినిమా షూటింగ్ జరుగుతుండాగా పవన్ కాలికి గాయం కావడంతో రెస్ట్ కోసం సింగపూర్ వేళ్ళిన విషయం తెలిసిందే. సింగపూర్లో 5 రోజులు రెస్ట్ తీసుకోని తీరిగి హైదరాబాద్ వచ్చేసాడు పవన్. రావడంతో సర్దార్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు.
హైదరాబాద్ లో వేసిన భారీ సెట్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ నెల 30వరకు ఈ సినిమా ఇక్కడే షుటింగ్ జరిపి వచ్చేనెల ఫిబ్రవరి 1 నుంచి కేరళలో షూట్ చేయనుందట. అక్కడ ఓ వారం రోజుల పాటు షెడ్యూల్ ప్లాన్ చేసారట. ఈ షెడ్యూల్లో ఓ పాట షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నడట దర్శకుడు.
ఎక్కడ టైమ్ వేస్ట్ చేయకుండా సినిమాని తొందరగా పూర్తి చేస్తున్నాడు పవన్. ఖచ్చితంగా ఈ సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేసాడట. పవన్ అభిమానుల అంచనాలు అందుకునే విధంగా ఈ సినిమా తెరకేక్కిస్తున్నాడట ఈ సినిమా దర్శకుడు బాబీ. పవన్ సరసన మొదటి సారిగా కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
