Sunday, May 19, 2024
- Advertisement -

సరైనోడు పాత్ర ఇదే!

- Advertisement -

గణతంత్ర దినోత్సవం సందర్బంగా అల్లు అర్జున్ నటిస్తున్న ‘సరైనోడు’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇప్పుడు ఈ ఫస్ట్‌ లుక్‍కి అద్భుతమైన స్పందన వస్తుంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యుల్ తో బిజీగా ఉంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నడట.

బన్నీ సరసన రకుల్ ప్రీతి సింగ్ నటిస్తున్న ఈ సినిమాలో బన్నీ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గణ గా కనిపించబోతున్నాడట. బన్నీ ఫ్యాన్స్‌ అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా తెరకేక్కిస్తున్నాడట బోయపాటి. ఈ సినిమాలో అల్లు అర్జున్ భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చేయసాడట. ఈ సినిమాని సమ్మర్‍లో అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్బంగా ఈ ఏప్రిల్ 8న విడుదల చోయబోతున్నారట.

వచ్చే నెల ఫిబ్రవరి 14న  ప్రేమికుల దినోత్సవం సందర్బంగా ఈ సినిమా ఆడియో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. రకుల్‍తో పాటు కేథరిన్ త్రేస కూడా రెండో హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -