తెలుగు సినిమా రేంజ్ ని మారుస్తుంది అనుకుంటే ఏకంగా భారత దేశ చలన చిత్ర పరిశ్రమ రేంజ్ నే ప్రపంచానికి చూపించింది బాహుబలి సినిమా. ఈ సినిమా మొదటి భాగం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సంచలనాన్ని పునాది గా చేసుకుని బాహుబలి 2 బిజినెస్ సాగుతుంది అని చెప్పనక్కర లేదు.
సిరీస్ లో భాగంగా వచ్చిన ఒక సినిమా హిట్ అయిందంటే.. ఖచ్చితంగా రెండో మూవీకి రేట్లు ఆకాశంలో ఉంటాయి. ఇది సామాన్య సినిమాల సంగతి అలాంటిది బాహుబలి సంగతి ఇక చెప్పకర్లేదు కూడా. బాహుబలి ది కంక్లూజన్ కి.. ఎవరూ ఊహించలేనంతగా రేట్లు చెబుతున్నారు. అసలు ఇంత మొత్తం తిరిగి రాబట్టే అవకాశం ఉందా అంటే ఆలోచనలో పడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు.
ఇక్కడి లెక్కలు ఇంకా తెగలేదు కానీ… ఇప్పటికైతే యూఎస్ రైట్స్ కోసం టాక్స్ పీక్స్ లో ఉన్నాయి. బాహుబలి 2 కి కేవలం అమెరికా లోనే ముప్పై ఐదు కోట్లు రేటు ఒచ్చింది అంటే ఇక అర్ధం చేసుకోవచ్చు. మొదటి భాగం ఏడు మిలియన్ డాలర్ లు వసూలు చేసింది 9 కోట్లకి అమ్ముడు అయ్యి అంతగా మూడు రెట్లు లాభాలు ఇచ్చింది ఈ చిత్రం.
ఈ సారి మాత్రం రేటు గూబ వాసిపోయే లాగా ఉంది. అంతర్జాతీయ రేట్ యాభై కోట్లైనా రాబట్టాలి అని నిర్మాతల ప్లాన్ అట అందుకే అమెరికా కే 35 కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. మరి ఇది అంతగా వర్క్ అవుతుందా అనేది ప్రశ్న. మొదటి భాగానికి వచ్చినట్టు ఏడు మిలియన్ డాలర్ షేర్ వచ్చినా ముప్పై కోట్లు దాటుతుంది అప్పుడు సినిమా నష్టం లో ఉండిపోతుంది కదా అంటున్నారు మరికొందరు.
