Sunday, June 16, 2024
- Advertisement -

తెరాస దే మేయర్ పీఠం అంటున్నారు !!

- Advertisement -

ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న గ్రేటర్ ఎన్నికల పోరు హోరు జోరు గా ముగిసింది. మజ్లిస్ వారి గొడవలు మినహా ఎలాంటి అవాంచనీయ సంఘటనలూ జరగకుండానే పోలింగ్ ముగిసింది. ఈ సారి పోలింగ్ కి జనం బాగా బయటకి వచ్చి ఓటు వేస్తారు అని అనుకున్నారు కానీ ఎవ్వరూ సరిగ్గా రాలేదు.

కేవలం 45 % మాత్రమే రావడం తో అందరూ ఆశ్చర్య పోతున్నారు. ఇదే సమయం లో పార్టీలు తమకి ఇచ్చే సీట్ ల సంఖ్య ని కూడా చెప్పెసేతున్నాయి. మరొక పక్క ఎగ్జిట్ పోల్స్ కూడా ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణ అధికారపక్షం టీఆర్ ఎస్ కు 81 నుంచి 85 సీట్లు.. టీడీపీ బీజేపీలక 25 నుంచి 30 సీట్లు.. మజ్లిస్ కు 32 నుంచి 37.. కాంగ్రెస్ కు 3 నుంచి 7.. ఇతరులకు మూడు స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేల్చాయి.

పార్టీల వారీగా వారు చెప్పేది చూసుకుంటే తమకి డబ్భై ఐదు సీట్ లు వస్తాయి అని తెరాస చెబుతోంది. మజ్లిస్ 40 సీట్లు పక్కా అంటోంది. టీడీపీ 30 అంటుంటే బీజేపీ 18 అంటోంది. కాంగ్రెస్ కూడా 15 అని నెంబర్ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్స్ ఒక పక్క 85 సీట్ లు తెరాస వే  అంటే తెరాస మాత్రం తమకి 75 ఒస్తాయి అనడం ఆశ్చర్యకరం.

అదే సమయంలో మజ్లిస్ కు 32 నుంచి 37 డివిజన్లు అని ఎగ్జిట్ పోల్స్ చెబితే.. తాము 40 స్థానాల్లో విజయం సాధిస్తామన్న ధీమాను వ్యక్తం చేసింది. మజ్లిస్ మాటకు.. ఎగ్జిట్ పోల్స్ కు మధ్యన స్వల్ప వ్యత్యాసం ఉంది. ఎవరి లెక్కలు ఏంటి అనేది ఈనెల ఐదు న అర్ధం అయిపోతుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -