క్యూబాలో ఘోర విమానం ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 100 మంది దుర్మరనం పాలయ్యారు. శుక్రవారం హవానా నుంచి తూర్పు క్యూబాలోని హోల్గున్ బయల్దేరిన విమానం టేకాఫ్ అయిన కాసేపటికే క్రాష్ అయ్యింది. ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు 9 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం అందులో 100 మంది మృతి చెందినట్టు అధికారికంగా ప్రకటించారు.
ప్లయిట్లో ఉన్న 114 మందిలో ముగ్గురు మాత్రమే తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డారని క్యూబా అధ్యక్షుడు మిగ్యుయెల్ డియాజ్ కానెల్ తెలిపారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఆయన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
ప్రమాదానికి గురైన విమానాన్ని గ్లోబల్ అనే మెక్సికన్ ఎయిర్‌లైన్ నుంచి క్యూబానా ఎయిర్‌లైన్ లీజుకు తీసుకుందని ఆ దేశ మీడియా తెలిపింది. 1979లో ఈ విమానాన్ని తయారు చేసినట్టు మెక్సికో ప్రభుత్వం తెలిపింది. దాన్ని క్యూబన్ ఎయిర్‌లైన్స్ అద్దెకు తీసుకుని నడుపుతుంది.