బాలయ్యకు రామ్ చరణ్ ఛాలెంజ్ విసరబోతున్నాడు. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ లాంటి సీనియర్ హీరో బాలయ్యకు పట్టుమని పదేళ్ళ అనుభవం ఉన్న ఈ జనరేషన్ స్టార్ హీరో రామ్ చరణ్ ధీటైన సవాల్ విసరబోతున్నాడు. రంగస్థలం హిట్‌తో మాంచి ఊపు మీదున్న రామ్ చరణ్ ఇప్పుడు ఏ హీరోనైనా ఛాలెంజ్ చేసే స్థితిలో ఉన్నాడన్నది వాస్తవం. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి సంక్రాంతి బరిలో పోటీ పడ్డాడు చరణ్. కమర్షియల్ సక్సెస్ మాత్రం చరణ్‌నే వరించింది. అయితే కంటెంట్ పరంగా మాత్రం మహేష్‌కి మార్కులు పడ్డాయి.
ఇప్పుడిక బాలయ్యతో పోటీకి సై అంటున్నాడు చరణ్. ఎవడు సినిమా తర్వాత మళ్ళీ సంక్రాంతి బరిలో ఎప్పుడూ నిలవలేదు చెర్రీ. కానీ ఈ సారి బోయపాటి శ్రీను దర్శకత్వంలో బోయపాటి మార్క్ ఊర మాస్ మసాలా సినిమాతో రానున్న చరణ్ సంక్రాంతిపై కన్నేశాడు. అదే టైంలోకి ఆల్రెడీ ఎన్టీఆర్ బయోపిక్ సినిమాతో రావాలని ప్లాన్ చేసుకుంటున్నాడు బాలయ్య. అయినప్పటికీ చరణ్ మాత్రం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని తన నిర్మాతలకు చెప్పాడట. సంక్రాంతి బరిలో నిలిస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే స్థాయిలో మన సినిమా కంటెంట్ ఉందని …….ఇప్పటి వరకూ సంక్రాంతి బరిలో నిలిచిన ప్రతిసారీ తనకు కమర్షియల్ సక్సెస్ వచ్చిందని………అందుకే ఎట్టి పరిస్థితిల్లోనూ సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేద్దామని చరణ్ చెప్తున్నాడట. రంగస్థలం సినిమాతో వంద కోట్ల మార్జిన్‌లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రామ్ చరణ్ పోటీలోకి దిగితే మాత్రం థియేటర్స్ నుంచీ కలెక్షన్స్ వరకూ మొదటి వారం ఊపు మామూలుగా ఉండదు అనడంలో సందేహం లేదు. మరి రామ్ చరణ్ ఛాలెంజ్‌ని బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య ఏ మేరకు ఎదుర్కుంటాడో చూడాలి.
