Monday, April 29, 2024
- Advertisement -

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కార్‌ని యాక్సిడెంట్ చేసిన సర్దార్ గబ్బర్‌సింగ్ డైరెక్టర్

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ డైరెక్టర్ బాబీ తన కాస్ట్లీ కార్‌తో ఒక సామాన్య సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చిన్న కార్‌ని యాక్సిడెంట్ చేశాడు. మనవాడి ఓల్వో కార్ దెబ్బకు ఆ చిన్న ఐ10 కార్ తుక్కయిపోయింది. ఆ కార్‌లో ఉన్న అతని పేరెంట్స్‌కి కూడా గాయాలయ్యాయి. అయితే ముందుగా కాంప్రమైజ్‌కి వచ్చి మాట్లాడుకుందాం అన్న డైరెక్టర్ బాబీ ఆ తర్వాత మాత్రం ‘పవన్ సార్’ అనే ఒక వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడాక ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కి హ్యాండ్ ఇచ్చాడు.

అయ్యప్పసొసైటీలో ఒక ఫంక్షన్‌కి పేరెంట్స్‌తో కలిసి వెళ్ళొస్తున్న ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కార్‌ని యాక్సిడెంట్ చేశాడు బాబీ. ఆ సమయంలో ఈ సర్దార్ గబ్బర్‌సింగ్ డైరెక్టర్ తాగి ఉన్నాడని ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చెప్తున్నాడు. యాక్సిడెంట్ అయిన వెంటనే కాంప్రమైజ్‌కి వద్దాం……. దగ్గరలోనే నా ఇళ్ళు……… వెళదాం రండి అంటూ పలిచిన బాబీ…… ఆ తర్వాత పవన్ సార్ అనే అతనితో యాక్సిడెంట్ గురించి మాట్లాడాడు. ఆ వెంటనే అదే యాక్సిడెంట్‌లో గాయపడిన తన తల్లికి సపర్యలు చేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కి ఝలక్ ఇచ్చి అక్కడ నుంచి జంప్ అయ్యాడు బాబీ. బాబీ ఫోన్‌లో మాట్లాడిన ఆ పవన్ సార్ అనే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణేనని సదరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చాకే అక్కడినుంచి బాబీ జంప్ అయ్యాడని ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చెప్తున్నాడు. సామాన్యులకు కనీస స్థాయి రక్షణ కూడాలేదని……… డబ్బున్నవాళ్ళు ఏం చేసినా అడిగే దిక్కు కూడా లేని సమాజం మనదని ఆ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -