రవితేజ, మాళవిక శర్మ హీరో, హీరోయిన్లుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘నేల టిక్కెట్టు’.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.ఇక సోగ్గాడే చిన్ని నాయనా, రారాండోయ్ వేడుక చూద్దాం వరుస హిట్స్‌తో దూకుడు మీద ఉన్న కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అవుతున్న మాళవిక శర్మ సినిమాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుందని భావిస్తున్నారు చిత్ర యూనిట్.ఇప్పటికే ప్రీమియర్ షోలతో పాటు, బెనిఫిట్ షోలు ప్రదర్శితం కావడంతో ట్విట్టర్‌లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం.
రవితేజ ఎనర్జీకి తగ్గట్లుగానే దర్శకుడు ఆయన క్యారెక్టర్‌ను మలిచారంటున్నారు. నేల టిక్కెట్టులోని సంభాషణలు బాగా కుదిరాయని.. రవితేజ మాస్ ఇమేజ్‌కి నేల టిక్కెట్టు డైలాగ్ డెలివరీకి పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యిందంటున్నారు. ఈ సినిమాలో రవితేజ ఎనర్జీ లెవెల్స్ సూపర్ అంటున్నారు.తొలి చిత్రంతోనే మాస్ ఆడియన్స్‌తో విజిల్స్ వేయించింది కథానాయిక మాళవిక శర్మ. నటనతో పాటు నేల టిక్కెట్‌కు కావల్సిన అందాలను కూడా ఆరబోసి కనువిందు చేసింది.జగపతిబాబు, రవితేజలు పోటీ పడి నటించారంటున్నారు. వీళ్ల మధ్య ఆధిపత్య పోరుతో సినిమా గ్రిప్పింగ్‌లోకి వెళ్లిందంటున్నారు. బ్రహ్మానంద, అలీ కామెడీతో అలరించారని తెలుస్తుంది.సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తం కామెడీతో నడిపించాడు దర్శకుడు.సినిమా మొదటి భాగం బాగుందని అభిమానుల ద్వారా తెలుస్తుంది.
ఫస్టాఫ్ కామెడీ, ఎమోషన్స్‌తో బాగానే నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌కి వచ్చేసరికి కాస్త నెమ్మదించినట్టు తెలుస్తోంది. హీరోయిజం చూపించేందుకు అక్కర్లేని సీన్లు చాలానే ఉన్నాయంటున్నారు. అయితే కొంత మంది మాత్రం సినిమా రొటీన్‌గానే ఉంది, చాలా బోరింగ్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.ఫిదా ఫేమ్ శక్తికాంత్ అందించిన పాటలు బాగున్నాయంటున్నారు. మరి రవితేజకు నేల టిక్కెట్టు మరో హిట్ అందిస్తుందో లేదో తెలియాలి అంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.
సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
