Monday, May 20, 2024
- Advertisement -

2014లో క్లీన్ స్వీప్ జిల్లాలోనే టిడిపి నుంచి వైకాపాలోకి భారీగా చేరికలు

- Advertisement -

2014లో అన్ని సీట్లూ టిడిపినే గెలుచుకుంది. పవన్ కుల మహత్యం, మోడీ మేనియా, ఎప్పుడూ బిజెపికి అండగా నిలిచే రాజులు కూడా పూర్తిగా టిడిపికి కూడా మద్దతివ్వడంతో కులసమీకరణాలన్నీ కలిసొచ్చి టిడిపి ఘన విజయం సాధించింది. చంద్రబాబు రుణమాఫీ హామీలు, నిరుద్యోగుల నుంచి అన్ని వర్గాల ప్రజలనూ హామీలతో మభ్యపెట్టినవైనం, పోలవరంతో సహా ప్రత్యేక హోదాలాంటి వరాలన్నీ టిడిపికి కలిసొచ్చాయి. నాలుగేళ్ళ తర్వాత ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. పోలవరం ప్రాజెక్ట్ అవినీతి కంపు కొడుతూ జిల్లా ప్రజలకు ఆవేదన మిగులుస్తోంది. ఇక కాపులందరూ ఇప్పుడు టిడిపికి బద్ధశతృవులయ్యారు.

ఈ నేపథ్యంలో పశ్ఛిమగోదావరి జిల్లా మూడ్ పూర్తిగా మారిపోయింది. 2019 ఎన్నికల్లో టిడిపికి ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితి ఉంటుందా అన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. టిడిపి ఓట్లన్నీ కూడా ఇక్కడ జనసేనకు ట్రాన్స్‌ఫర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికలకు ముందు పవన్‌తో పొత్తు లేకుండా ఇక్కడ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు టిడిపికి డిపాజిట్స్ కూడా రాలేదు మరి. ఇప్పుడు మరోసారి ఆ వాతావరణం కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దానికి తగ్గట్టుగానే పశ్ఛిమ గోదావరి జిల్లాలో జగన్ అడుగిడిన నాటి నుంచి వైకాపాలోకి భారీగా నాయకులు, బిజినెస్ మేన్ చేరికలు ఉంటున్నాయి. తాజాగా టిడిపి మాజీ ఎమ్మెల్యే కూడా వైకాపాలో చేరడం ఆశ్ఛర్యపరుస్తోంది. ఇక టిడిపి ఎంపిటీసీలు కూడా వైకాపాలో చేరారు. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మొత్తం జగన్‌కి మద్దతు ప్రకటించింది. ఇక వెనుకబడిన కులాల సంఘాలు కూడా 2019 ఎన్నికల్లో జగన్‌కే మద్దతిస్తామని చెప్తున్నాయి. మొత్తంగా చూస్తే 2014 ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు పూర్తిగా రివర్స్‌లో ఉన్నాయని……2019 ఎన్నికల్లో టిడిపి భారీగా నష్టపోయే జిల్లాల్లో పశ్ఛిమగోదావరినే ప్రథమ స్థానంలో నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -