Tuesday, April 30, 2024
- Advertisement -

డివిలియర్స్ రిటైర్‌మెంట్‌పై కోహ్లీ భావోద్వేగ ట్వీట్..

- Advertisement -

ఆధునిక క్రికెట్‌ను మరింత జనరంజకంగా మార్చిన ఆటగాళ్లెవరంటే మొదటి వరుసలో ఉండే పేరు డివిలియర్స్‌. వికెట్‌కు ఇరువైపులా అన్ని కోణాల్లో అతను కొట్టే షాట్లు ప్రేక్షకులతో ఔరా అనిపించినట్లే… రిటైర్మెంట్‌పై అతడి అనూహ్య నిర్ణయమూ ఆశ్చర్యపర్చింది. సరిగ్గా వారం క్రితం ఐపీఎల్‌లో హైదరాబాద్‌పై బౌండరీ లైన్‌ వద్ద అత్యద్భుత క్యాచ్‌ అందుకుని అహో అనిపించుకున్న ఏబీ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించారు.

అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నానని, తన నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఏబీ చెప్పడం ఫ్యాన్స్‌ను విస్మయానికి గురి చేసింది. అంతర్జాతీయ క్రికెట్‌కి డివిలియర్స్ వీడ్కోలు పలిన తరుణాన, అతడి ఐపీఎల్ సహచరుడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి నిశ్శబ్దం వీడాడు. తనదైన శైలిలో సఫారీ మేటి ఆటగాడి గురించి స్పందించాడు.

‘‘మై బ్రదర్.. నువ్వు చేసే ప్రతి పనిలో మంచి జరగాలని కోరుకుంటున్నా. క్రికెట్లో బ్యాటింగ్ చేసే విధానాన్నే మర్చేశావ్. నీకు నీ కుటుంబానికి నా అభినందనలు. జీవన ప్రయాణం అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా’’ అని అంటూ డివిలియర్స్ రిటర్మెంట్‌పై కోహ్లి ఎమోషనల్‌గా స్పందించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -