Tuesday, May 21, 2024
- Advertisement -

జగన్‌ని చూసి నేర్చుకోండి…..తేదే నేతలకు సుద్దులు

- Advertisement -

జగన్‌కి అనుభవం లేదు అన్న ఒక కారణాన్ని భూతద్దంలో చూపించి 2014 ఎన్నికల్లో చాలానే లాభపడ్డాడు బాబు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచీ అన్ని విషయాల్లోనూ జగన్‌ని బాబు ఫాలో అవుతున్న వైనం చూస్తూనే ఉన్నాం. రుణమాఫీలు అమలు చేయడం అసాధ్యం అని జగన్‌ చెప్పినట్టుగానే చంద్రబాబు చెయ్యలేకపోయాడు. ఫెయిల్ అయ్యాడు. ఆ రకంగా ప్రజలను మోసం చేశాడు. ఇక ప్రత్యేక హోదా విషయంలో, అవిశ్వాసతీర్మానాల విషయంలో పూర్తిగా జగన్‌నే ఫాలో అయ్యాడు చంద్రబాబు.

ఇప్పుడు ప్రసంగాల విషయంలో కూడా చంద్రబాబుతో సహా టిడిపి సీనియర్ నాయకులు అందరూ జగన్‌ని చూసి నేర్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. స్వయానా చంద్రబాబే ఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారు అని అనడం నుంచీ కమ్మ కులమే మళ్ళ మళ్ళీ అధికారంలోకి రావాలన్న స్పీకర్ నుంచీ తాజాగా వెంకన్న చౌదరి అంటూ మాట్లాడిన మురళీ మోహన్ వరకూ అందరూ కూడా కమ్మ కులాన్ని నెత్తిన పెట్టుకుంటూ ఇష్టారీతిన మాట్లాడుతూ సమాజంలో విభేదాలను రెచ్చగొడుతున్నారు. అయితే జగన్ మాత్రం ఏ రోజూ కూడా ఏ కులాన్నీ తక్కువ చేసి మాట్లాడలేదు. ప్రజల మధ్య విభేదాలు పెరిగేలా ఎప్పుడూ మాట్లాడలేదు. అలాగే చంద్రబాబు స్టైల్‌లో విభజన రాజకీయాలు కూడా చేయలేదు. ఇప్పుడు ఈ విషయాలనే ప్రస్తావిస్తున్నారు నెటిజనులు. తాజాగా సినిమా రచయిత చిన్ని కృష్ణ కూడా సమాజంలో చీలికలు రాకుండా, కుల రాజకీయాలకు చేయకుండా ప్రసంగాలు ఎలా చేయాలో జగన్‌ని చూసి నేర్చుకోవాలని మురళీ మోహన్‌కి సూచనలు చేశాడు.

ఇక నెటిజనులు కూడా అత్యంత అనుభవజ్ఙుడిని అని డప్పాలు కొట్టుకునే చంద్రబాబు నుంచీ టిడిపీ సీనియర్ నాయకులందరూ కూడా జగన్‌ని చూసి నేర్చుకోవాలని సుద్దులు చెప్తున్నారు. అనుభవం అనుభవం అని చెప్పుకుని 2014లో ఓట్లు కొల్లగొట్టిన చంద్రబాబు….. ఇప్పుడు పూర్తిగా జగన్ తెలివితేటలు, నిర్మాణాత్మక రాజకీయాలతో పోల్చుకుంటే తన వెన్నుపోటు, కుట్ర రాజకీయాల అనుభవం ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరం కాదని ఆయనే స్వయంగా నిరూపించుకున్నారన్న చర్చలు ఆంధ్రప్రదేశ్ నాట వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -