పవన్ కళ్యాణ్‌కి సినీ పరిశ్రమలో కూడా చాలా అభిమానులే ఉన్నారు. ఐతే ఈగ విలన్ సుదీప్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారు. రీసెంట్ గా కన్నడంలో పవన్ సినిమా అత్తారింటికి దారేది సినిమాని సుదీప్ రీమేక్ చేసి విజయం అందుకున్నాడు. అలాగే ఇప్పుడు మరో పవన్ సినిమాపై దృష్టి పెట్టాడట.
బాలీవుడ్ లో మంచి విజయం సొంతం చేసుకున్న ఓ మైగాడ్ కు రీమేక్‌గా తెలుగులో గోపాల గోపాల అనే సినిమా వచ్చింది. ఇప్పుడు సుదీప్ ఈ గోపాల గోపాల సినిమాని కన్నడంలో రీమేక్ చేయబోతున్నాడట. ఐతే ఈ సినిమాలో పవన్ కేవలం అతిథి పాత్రలో మాత్రమే కనిపిస్తాడు. కానీ కన్నడంలో సుదీప్ మాత్రం పవన్ చేసిన కృష్ణుడు పాత్రలో కాకుండా వెంకటేష్ చేసిన గోపాల పాత్ర పోషించనున్నాడట ఇది ఇక్కడ ట్వీస్ట్.
కన్నడంలో ముకుందా మురారి టైటిల్ తో ఈ సినిమా తెరకేక్కుతుంది. సో సుదిప్ పవన్ సినిమాలపై దృష్టి పెట్టాడు. ఐతే తెలుగులో మాత్రం గోపాల గోపాల సినిమా అనుకున్నంతగా విజయం సాధించలేదు. నిజానికి పవన్ అభిమానులు అతని పాత్ర సినిమా మొత్తం ఉంటుందని అనుకున్నారు. కానీ పవన్ పాత్ర కేవలం అతిథి పాత్ర మాత్రమే కావడం వల్ల పవన్ అభిమానులు నిరస చెందారు. ఐతే సుదీప్ మాత్రం అలాంటి తప్పు చేయకుండా వెంకటేష్ పాత్రలో నటిస్తున్నారు.