- Advertisement -

పాత గా కనపడ్డం కోసం ఎన్టీఆర్ కి మూడు కోట్లు

- Advertisement -

మొట్టమొదటి సారిగా నాన్నకు ప్రేమతో సినిమాతో యాభై కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఆ  సక్సెస్ కి సంబంధించిన ఖుషీ లో ఫుల్ జాయ్ గా ఉన్నాడు. ఈ ఆనందంలో తన తరవాత ప్రాజెక్ట్ కి వెళ్ళబోతున్నాడు నందమూరి కుర్రాడు. ఈ నెల 22 నుంచీ కొరటాల శివ తో చెయ్యబోతున్న జనతా గ్యారేజీ షూటింగ్ ని మొదలు పెట్టాలని చూస్తున్నాడు.

జనత గ్యారేజ్ కోసం ఇప్పటికే సారధీ స్టూడియోస్ లో సెట్ వేస్తున్నారు అని తెలిపాం , అయితే ఆ సెట్ పూర్తి అవ్వడానికి దగ్గరలో ఉందట. ఈ సెట్ కోసం మూడు కోట్ల ఖర్చు పెట్టారు అంటున్నారు.

మామూలుగా కనపడ్డం కాకుండా బాగా పాత మోడల్ సెట్ లాగా గ్యారేజీ కనపడ్డం కోసం ఇంకా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టారు అనీ లేదంటే ఒక కోటి రూపాయల లోపలే సినిమా కోసం వేసిన సెట్ పూర్తి అయిపోయేది అంటున్నారు సినిమా వర్గాల వారు.

ఓ 15-20 పాత కార్లను గ్యారేజ్ లో చేర్చే పనిలో పడ్డారు యూనిట్. ఇప్పటికే విడివిడిగా చెరో రెండు హిట్స్ కొట్టిన ఎన్టీఆర్ – కొరటాల శివలకు… జనతా గ్యారేజ్ తో కంబైన్డ్ గా హ్యాట్రిక్ పూర్తి చేసేందుకు సిద్ధమైపోతున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -