Tuesday, May 14, 2024
- Advertisement -

కుర్ర డైరెక్టర్ పెళ్లి చేసుకున్నాడు

- Advertisement -

సినిమా రంగంలో ఈ మధ్య కుర్ర దర్శకులు ఎక్కువ అవుతున్నారు, తమ లక్ష్యం సాధించడం జరిగిన తరవాతనే పెళ్లి చేసుకునేవారు ఉన్నారు. అయితే హిట్టో ప్లాపో సూర్య vs సూర్య అనే సినిమా తీసాడు డైరెక్టర్ కార్తి ఘట్టమనేని. నిజానికి అతను సినిమాటోగ్రాఫర్ కార్తికేయ సినిమా షూటింగ్ లో హీరో నిఖిల్ సిద్దార్థ్ కి ఈ కథ ని చెప్పి ఒప్పించిన కార్తీక్ సినిమాని సెట్స్ మీదకి త్వరగానే తీసుకుని వెళ్ళాడు.

అయితే ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు అని చెప్పాలి. కార్తిక్ నిన్న పెళ్లి చేసుకుని తన పెళ్లి ఫోటో ట్విట్టర్ లో పెట్టాడు. కార్తీక్ తండ్రి శ్రీనివాస్ ఘట్టమనేని ఐపీఎస్ అధికారి కావడం విశేషం. వీరికి కృష్ణ కుటుంబంతో బంధుత్వం ఉందని కూడా అంటారు.

చెన్నైలో ఇంజినీరింగ్ చదివిన కార్తీక్.. సినిమాలపై మక్కువతో సినిమాటోగ్రఫీలోకి వెళ్లాడు. ఆ తర్వాత చాలా త్వరగానే దర్శకత్వ కలను నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు సెకండ్ సినిమా కోసం స్క్రిప్ట్ పట్టుకుని ప్రయత్నాలు చేస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -