చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రాకేశ్ శశి దర్శకత్వంలో ‘విజేత’ సినిమా రూపొందింది. వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాలో, కల్యాణ్ దేవ్ జోడీగా మాళవిక నాయర్ నటించింది. సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఆడియో ఫంక్షన్ డేట్ ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ నెల 24వ తేదీన ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ వేడుకకి ముఖ్య అతిథిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తున్నారని సమాచారం.అల్లుడు కాబట్టి చిరంజీవి వస్తారు.అలాగే మెగా ఫ్యామిలీ హీరోలందరు వచ్చి కల్యాణ్ దేవ్‌కు మద్దతుగా నిలుస్తారని తెలుస్తుంది.రాజకీయలలో బిజిగా ఉన్న పవన్ ఈ నెల 24వ తేదీన తన అన్న అల్లుడు కోసం పొలిటిక్స్‌కు కాస్తా బ్రేక్ ఇచ్చి ఈ ఆడియో ఫంక్షన్‌కు వస్తున్నారని మెగా ఫ్యామిలీ సన్నిహితులు ద్వారా తెలుస్తుంది.
