- Advertisement -
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా ఇండియన్ సినిమాలు గురించి అవహేళనగా మాట్లాడింది.భారతీయ సినిమాల్లో నటించి లెక్కలేనంత పేరు సంపదించిన ప్రియాంక భారతీయ సినిమాలపై అసభ్యకర రీతిలో కామెంట్ చేసింది.ఇటీవల జరిగిన 68వ ఎమ్మి అవార్డ్స్ వేడుకల్లో ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా భారతీయ సినిమాలన్నీ హిప్స్ అండ్ బూబ్స్ చుట్టే తిరుగుతాయని అసభ్యకర రీతిలో కామెంట్ చేసింది ప్రియాంకా.
రెండు మూడు హాలీవుడ్ అవకాశాలు రాగానే కళ్ళు నెత్తికెక్కాయా అంటే నెటిజిన్లు కామెంట్ చేస్తున్నారు.ఇప్పటికే క్యాంటికో ప్రొగ్రామ్‌లో ఇండియన్స్‌ను తీవ్రవాదులుగా చూపించి తీవ్ర విమర్శల పాలైంది ప్రియాంక. ఇండియన్ సినిమా గురించి అవహేళనగా మాట్లాడిన ప్రియాంకను బాలీవుడ్ మూవీస్‌లో తీసుకొవద్దనే కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి.
