- Advertisement -
బాలీవుడ్ బ్లాక్ బ్యూటి ప్రియాంక చోప్రా గత కొన్ని రోజులుగా నిత్యం వార్తల్లో నిలుస్తు వస్తుంది.ప్రియాంక హాలీవుడ్‌కు సింగర్ నిక్ జోనాస్‌ను ప్రేమిస్తుందని,వీరిద్దరు డేటింగ్లో ఉన్నారని పకార్లు వస్తున్నాయి.అయితే ఈ వార్తలను నిజం చేస్తు వీరిద్దరు కలిసి దర్శనమివ్వడం పుకార్లకు మరింత బలం చేకూర్చింది.ఇదిలా ఉండగా ఇప్పుడు అందరి దృష్టి ఫోటోలో ఉన్న ప్రియాంక బ్యాగ్‌పై పడింది.
వెరైటీ డిజైన్‌తో చూడడానికి కొత్తగా ఉన్న ఆ బ్యాగ్ అందరి దృష్టి ఆకర్షించింది. అయితే ఆ బ్యాగ్ ధర చూసి నెటిజన్లు అంతా షాకవుతున్నారు. ఆమె బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే మీరు కూడా బ్యాగ్ సైడ్ ఓ లుక్ వేస్తారు మరీ.ఆ బ్యాగ్ ధర దాదాపు 4.6లక్షల రూపాయలు. ఆ ధరతో ఏకంగా ఓ కారే కొనొచ్చు. టియాగో కారు విలువ దాదాపు రూ.3.56 లక్షలు. అంటే ప్రియాంక బ్యాగ్ కంటే తక్కువే.