నిప్పు ,పప్పుల‌పై సీబీఐ విచారణ జరగాలి: విజయసాయి రెడ్డి

టీటీడీ తనకు నోటీసులు పంపించందంటూ వస్తున్న మీడియా కథనాలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధవారం స్పందించారు. తనకు టీటీడీ నుంచి ఇంతవరకూ ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. అస‌లు నోటీసులు హ‌క్కు టీటీడికి లేద‌ని తెలిపారు.4 సంవత్సరాలు టీడీడీ బోర్డులో సభ్యుడిగా తాను పని చేసిన విషయాన్ని ఈ సందర్భంగా విజయసాయి గుర్తు చేశారు.‘టీటీడీ సొమ్మును ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దోపిడీ చేశాడు.

ఆయన కొడుకు ఈ సొమ్మును విదేశాలకు తరలించాడు. ఇదే నా ప్రధాన ఆరోపణ. నా ఆరోపణకు సోర్స్‌ ఏదని ప్రశ్నించే అధికారం మీకు లేదు. ఎప్పుడూ నిప్పు అని చెప్పుకునే నిప్పు నాయుడు, పప్పు నాయుడిలపై సీబీఐ విచారణ జరగాలి. విచారణలో మీరు నిర్ధోషులని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటా.వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మీ అవినీతి లెక్కలను వైఎస్సార్‌ సీపీ తేల్చుతుందని విజయసాయి రెడ్డి హెచ్చ‌రించారు.