- Advertisement -
ఎమ్మెల్యే రోజా తన మాటల తూటాలతో ప్రత్యర్థలను హడలెత్తిస్తారు.ఎమ్మెల్యే కాకముందు రోజా హీరోయిన్గా చేసిన సంగతి తెలిసిందే.ఎమ్మెల్యే అయిన తరువాత కూడా సినిమాల మీద ఉన్న ప్రేమతో ఆమె పలు సినిమాలలో యాక్ట్ చేసింది.జబర్దస్త్ కామెడీ షోలో రోజా జడ్జిగా వ్యవహిస్తున్నారు.తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి.మహనటి సావిత్రి గెటప్‌లో రోజా సందడి చేశారు.
సావిత్రి గెటప్‌లో ఆమె దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.ఈ సందర్భంగా మహిళల యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పేలా సందేశాత్మకంగా ఓ కామెంట్ పెట్టారు. ‘నిజమైన మహిళలు అత్యున్నతంగా, శక్తిమంతంగా, స్వత్రంత్ర భావాలతో, నమ్మకంగా, ప్రేమగా ఉంటారు’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.