Tuesday, May 7, 2024
- Advertisement -

ర‌జ‌నీకి అడుగు దూరంలో కాజ‌ల్‌

- Advertisement -

త‌మిళ, తెలుగు భాష‌ల‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది కాజ‌ల్ .ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 సంవ‌త్సరాలు దాటిని ఇప్ప‌టికి ఏదో ఒక సినిమాలో క‌నిపిస్తు సంద‌డి చేస్తుంది.తెలుగులో దాదాపు అంద‌రి హీరోల‌ని క‌వ‌ర్ చేసేసింది కాజ‌ల్‌.చివ‌రికి మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న కూడా హీరోయిన్‌గా న‌టించింది.త‌మిళంలో కూడా దాదాపు అంద‌రి హీరోల ప‌క్క‌న హీరోయిన్‌గా చేసింది.అయితే ఒక్క సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో త‌ప్ప‌.

అయితే ర‌జ‌నీతో సినిమా చేయ‌డానికి ఒక్క అడుగు దూరంలో ఉంది.రజ‌నీకాంత్ ప్ర‌స్తుతం కార్తీక్ సుబ్బరాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు.ఈ మూవీలో కాజ‌ల్‌ని తీసుకోవ‌ల‌ని చిత్ర యూనిట్ భావిస్తుంది.కాజ‌ల్ అయితే ర‌జ‌నీ పక్క‌న ఫ్రెష్ లుక్‌లో క‌నిపిస్తుంద‌ని కార్తీక్ సుబ్బరాజ్ ఆలోచ‌న‌.దీనిపై ర‌జ‌నీతో చర్చించిన త‌రువాత కాజ‌ల్‌ను ఓకే చేస్తార‌ని స‌మాచారం.ర‌జ‌నీ క‌నుక ఓకే చేస్తే సూప‌ర్‌స్టార్‌తో కాజ‌ల్ సినిమా చేయ‌డం ఖాయం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -