అందుకే ‘జబర్దస్త్ నుండి బయటికి వచ్చేశా!

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న వారిలో ‘షకలక శంకర్ ఒకడు. కమెడియన్‌గా మంచి పేరు సంపాదించుకున్నాడు శంకర్., మరో వైపున హీరోగా వచ్చిన అవకాశాలను కూడా ఆయన అందిపుచ్చుకుంటున్నాడు. శంకర్ శంభో శంక‌ర సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా శంక‌ర్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నాడు.

‘జబర్దస్త్’ నుంచి ఎందుకు బయటికి వచ్చేశారు అనే ప్రశ్నకి ఆయన స్పందిస్తూ .. “మొదటి నుంచి కూడా ఒక వైపున సినిమాలు చేస్తూనే .. మరో వైపున ‘జబర్దస్త్’ చేసేవాడిని. సినిమాలు ఎక్కువుగా రావ‌డంతో ‘జబర్దస్త్స మానేసి , సినిమాలు చేస్తున్నాన‌ని తెలిపాడు. ఆ విషయాన్ని నాగబాబుగారికి ,రోజా గారికి ,దర్శక నిర్మాతలకి చెప్పే బయటికి వచ్చేశానని చెప్పుకొచ్చాడు.