Tuesday, May 7, 2024
- Advertisement -

జ‌గ‌న్ సొంత జిల్లాలో ప‌ట్టు నిలుపుకుంటాడా?

- Advertisement -

క‌డ‌ప జిల్లా మొద‌టి నుండి కాంగ్రెస్ పార్టీ కంచుకోట‌గా ఉండేది.వైఎస్ఆర్ హ‌యం నుండి క‌డ‌ప‌లో కాంగ్రెస్ హ‌వా ఎక్కువ‌. వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌రువాత వైఎస్ఆర్ త‌న‌యుడు వైఎస్‌.జ‌గ‌న్ వైఎస్ఆర్‌సీపీ పార్టీని స్థాపించ‌డం జ‌రిగింది. ఇక్క‌డ కాంగ్రెస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు అంద‌రు వైఎస్ఆర్‌సీపీలో చేరారు. ఇక్క‌డ వైఎస్ఆర్‌సీపీ ప్ర‌భావం ఉప ఎన్నిక‌లు,సాధార‌ణ ఎన్నిక‌ల‌ప్పుడు స్ప‌ష్టంగా క‌నిపించింది.

అయితే 2014లో జ‌రిగిన ఎలెక్ష‌న్స్‌లో టీడీపీ అధికారంలోకి రావ‌డం జరిగిన, క‌డ‌ప‌లో మాత్రం ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే గెలిచింది. త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల‌తో జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినార‌య‌ణ రెడ్డి టీడీపీలో చేరారు. ఇక మ‌ళ్లీ ఎలెక్ష‌న్స్ టైం వ‌చ్చింది. మ‌రి ఈసారి క‌డ‌ప‌లో వైసీపీ ప‌రిస్థితి ఎలా ఉందో ఓసారి చూద్దాం. క‌డ‌ప‌లో మొత్తం 10 అసెంబ్లీ నియోజిక వ‌ర్గాలు ఉన్నాయి.గ‌తంలో ప‌దికి ప‌ది సీట్లు గెలిచే పరిస్థితి ఉండేది. కాని ఇప్ప‌డా ఆ పరిస్థితి లేద‌ని తెలుస్తుంది. 2014 జరిగిన ఎలెక్ష‌న్స్‌లో రాజంపేట మిన‌హా మిగిలిన అన్ని సీట్లలో విజ‌యం సాధించింది వైఎస్ఆర్‌సీపీ.

అయితే 2019లో జ‌రిగే ఎలెక్ష‌న్స్‌లో ఇన్ని సీట్లు రాక‌పోవ‌చ్చు అంటున్నారు రాజ‌కీయ విశ్లేషుకులు. వైసీపీ ఈసారి జ‌మ్మ‌ల‌మ‌డుగు సీటు గెల‌వ‌డం క‌ష్ట‌మ‌నే అంటున్నారు. అక్క‌డ ఆదినార‌య‌ణ రెడ్డి చాలా బ‌లంగా ఉన్నార‌ని,క్యాడ‌ర్ కూడా టీడీపీకి ఉంద‌ని ఈసారి జ‌మ్మ‌ల‌మ‌డుగు సీటు టీడీపీ ఖాతాలోకి వెళ్ల‌డం ఖాయం అంటున్నారు. ఇక క‌డ‌ప‌లో మ‌రో సీటు కూడా టీడీపీ గెలుస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేషుకుల అంచనా.

రైల్వే కోడురులో కూడా టీడీపీ స్ట్రాంగ్‌గానే ఉంద‌ని ,ఇక్క‌డ టీడీపీ గెలిచే అవ‌కాశాలు ఉన్నాయాని స‌మాచారం. మొత్త‌నికి చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష నేత జిల్లాలో పాగా వేయ‌డానికి ప్ర‌య‌త్నాలు బాగానే చేస్తున్నారు. ఇప్ప‌టికే కిందస్థాయి నేత‌ల‌కు డ‌బ్బ‌లు పంపిణీ జరిగినట్లు తెలుస్తుంది. వైసీపీకి జిల్లాపై రోజు రోజుకి ప‌ట్టు స‌డ‌లిపోతుందని స‌మాచారం. 2019లో జ‌రిగే ఎలెక్ష‌న్స్‌లో ఎట్టిప‌రిస్థితుల‌లో సీఎం కావ‌ల‌నుకుంటున్న జ‌గ‌న్‌కు త‌న సొంత జిల్లాలోనే సీట్లు రాక‌పోతే ప‌రువు పోతుంది. మ‌రి ఈ విష‌యంలో జ‌గ‌న్ ఎలాంటి వ్యూహాలు ర‌చిస్తాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -