స్టార్ హీరోతో అనుప‌మా?

అనుప‌మా పరమేశ్వరన్ తెలుగులో వ‌రస పెట్టి సినిమాలు చేస్తుంది. కుర్ర హీరోల‌తో హీరోయిన్‌గా చేస్తున్న అనుప‌మా పరమేశ్వరన్‌కు ఓ స్టార్ హీరో ప‌క్క‌న హీరోయిణ్‌గా చాన్స్ వ‌చ్చింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్టార్ హీరో తెలుగు ఇండ‌స్ట్రీకి చెందిన వ్య‌క్తి కాదు. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ సరసన అనుప‌మా పరమేశ్వరన్‌కు హీరోయిన్‌గా అవ‌కాశం వచ్చింద‌ని స‌మాచారం.

ఇదే క‌నుక నిజం అయితే క‌న్న‌డ‌లో ఆమెకు ఇదే మొద‌టి సినిమా అవుతుంది. అనుప‌మా చేతిలో కొన్ని తెలుగు సినిమా ఆఫర్లున్నాయి. త్వరలోనే ‘తేజ్ ఐ లవ్‌యూ’ సినిమా రాబోతోంది. తెలుగులో స్టార్ హీరోల ప‌క్క‌న హీరోయిన్‌గా ట్రై చేస్తుంది అనుప‌మా.