Thursday, May 16, 2024
- Advertisement -

కాళేశ్వరం ప్యాకేజీ 8 పంపింగ్ స్టేషన్

- Advertisement -

ఇది ప్రపంచంలో అతిపెద్ద నీటిపారుద పంపింగ్‌ స్టేషన్‌ కథ. అందులోనూ భూగర్భంలో 330 మీటర్ల దిగువన నిర్మించినది. అసలు ఎత్తిపోత పథకాలే ఇంత పెద్ద స్థాయిలో ప్రపంచంలో ఎక్కడా లేవు. గరిష్టంగా 3 టిఎంసీ నీటిని ఎత్తిపోసే విధంగా నిర్మిస్తున్న ఈ ఎత్తిపోత పథకం ప్రపంచంలో మొదటి స్థానాన్ని ఆక్రమించనుంది. ఒక్కొక్కటి 139 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 7 యూనిట్లు కలిగిన ఈ పంపింగ్‌ స్టేషన్‌ను భూగర్భంలో నిర్మించడం మరో అరుదైన విషయం. ఈ స్థాయి నిర్మాణాు ఇంతవరకూ చరిత్రలో ఎక్కడా లేకపోగా తొలిసారిగా మేఘా ఇంజనీరింగ్‌ (ఎంఇఐఎల్‌) అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది.

భూమి పైభాగంలో 330 మీటర్ల ఎత్తున ఒక భారీ భవంతి నిర్మిస్తే ఎలా వుంటుందో అటువంటిది భూమికి దిగువభాగాన పంప్‌హౌస్‌ను ఎంఇఐఎల్‌ నిర్మించింది. అందులో 110 మీటర్లు నీటిని పంపు చేసే విధంగా పంపు, మోటార్లు ఏర్పాటు చేస్తోంది. అదే కాళేశ్వరం ఎత్తిపోత పథకంలోని కీకమైన పని. దీన్ని ప్యాకేజీ 8 గా పిుస్తారు. సాంకేతికంగా, శాస్త్రీయంగా ఇక్కడ భూమి దిగువన పంపింగ్‌ స్టేషన్‌ నిర్మించాల్సి వచ్చింది. దీన్ని మానవనిర్మిత ఇంజనీరింగ్‌ అద్భుతంగా అభివర్ణించవచ్చు. దీని ద్వారా రోజుకు 3 టిఎంసీ నీరు ఎత్తిపోయడం జరుగుతుంది. ఈ విధమైన ఇంజనీరింగ్‌ అద్భుతాు ప్రపంచం మొత్తం మీద అతికొద్ది మాత్రమే వున్నాయి. వాటిలో ఇది ఒకటి కాగా, భూగర్భంలో ఇంత పెద్ద స్థాయిలో పంపింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు కావడం ఇదే మొదటిది.

ఈ పంప్‌ హౌస్‌లో ప్రతి అంతస్తులోనూ 87,995 చదరపు అడుగు కాంక్రీటు నిర్మాణం అవుతోంది. ఇందులో మొదటిదశలోని 5 యూనిట్లు 57,049 చదరపు అడుగు విస్తీర్ణంలో ప్రతి అంతస్తు నిర్మిస్తుండగా రెండో దశలోని రెండు యూనిట్లు ప్రతి అంతస్తు 30,946 చదరపు అడుగు విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. పంపు హౌస్‌లో ప్రధానంగా ట్రాన్స్‌ఫార్మర్‌బేు, కంట్రోల్‌ రూరు రెండు చొప్పున, బ్యాటరీ రూం, మోటార్‌ రూం (అంతస్తు) ఒక్కొక్కటి చొప్పున వున్నాయి. అదే విధంగా ఎల్‌టి ప్యానల్స్‌, పంప్‌ ఫ్లోర్‌, కంప్రెషర్‌ు కలిపి మొత్తం 4 అంతస్తుతో నిర్మిస్తున్నారు.

ఈ పనిని ఎంఇఐఎల్‌ ఛాలెంజింగ్‌ గా తీసుకుని బిహెచ్‌ఇఎల్‌ సహకారంతో అనితరసాధ్యమనే రీతిలో నిర్మిస్తోంది. మొత్తం పనిలో 40 శాతం బిహెచ్‌ఇఎల్‌ వాటా.. అంటే మోటార్లు, పంపు, యంత్ర పరికరాు, విడిభాగా రూపంలో సరఫరా చేయడం కాగా, వాటిని వివిధ ప్రాంతా నుంచి సేకరించి ప్యాకేజీ 8 వద్దకు తీసుకొచ్చాక అసెంబల్‌ / ఎరక్షన్‌ చేయడం కీకమైన 60 శాతం పనిని ఎంఇఐఎల్‌ సాంకేతిక నైపుణ్యంతో పూర్తి చేస్తోంది. నిర్మాణ రంగంలో ముఖ్యంగా ఎక్ట్రోమెకానికల్‌ పనుల్లో 25 ఏళ్ల అనుభవం కలిగిన ఎంఇఐఎల్‌ ఈ పనిని అత్యంత క్లిష్టపరిస్థితును ఎదుర్కొని సైతం విజయవంతంగా పూర్తి చేస్తోంది.

ఈ పంప్‌హౌస్‌లో ప్రధానంగా పంపు, మోటార్లతోపాటు టన్నెల్స్‌, సర్జ్‌పూల్‌ మొదలైన క్లిష్టమైన పనును అకుంఠిత దీక్షతో చేపట్టింది. ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా లేని విధంగా ఈ ప్యాకేజీలో కేవరిన్‌ నిర్మించింది. ఇందులో సర్జ్‌పూల్‌, అడిషనల్‌ సర్జ్‌పూల్‌ మొదలైనవి వున్నాయి. దీని పరిమాణం 330 మీటర్ల లోతు, 25 మీటర్ల వెడ్పు, 65 మీటర్ల ఎత్తులో వుందంటే ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఇటువంటి నిర్మాణం ఇంతవరకూ ప్రపంచంలో ఎక్కడా లేదు.

పంప్‌హౌస్‌ నిర్మాణాన్ని పరిశీలిస్తే అది ఎంత పెద్దదో అర్ధమైపోతుంది. పంప్‌హౌస్‌ సర్వీస్‌బే (ఏRూ- Rవసబషవస ూవఙవశ్రీ) భూమి ఉపరితలానికి G221 మీటర్ల దిగువన ఉంది. పంప్‌బే G190.5 మీటర్ల దిగువన, ట్రాన్స్‌ఫార్మర్‌బే 215 మీటర్ల వద్ద, కంట్రోల్‌ రూం G209 మీటర్ల వద్ద నిర్మించారు.

మొదటిదశలో 5 యూనిట్లు, రెండో దశలో 2 యూనిట్లు అంటే మొత్తం 7 పంపు, మోటార్లను (ఒక పంపు, ఒక మోటార్‌ను ఒక యూనిట్‌) నిర్మిస్తున్నారు. ఇప్పటికే 5, 4 యూనిట్ల నిర్మాణం పూర్తయి ప్రాధమిక ట్రైల్‌ రన్‌ పూర్తి చేశారు. పూర్తిస్థాయి ట్రైల్‌ రన్‌ నిర్వహించడానికి సిద్ధంగా వున్నాయి. అంటే నీటిని ఇక ఎత్తిపోయడమే తరువాయి. మొదటిదశలోని 1, 2 యూనిట్ల ఏర్పాటు చురుగ్గా జరుగుతోంది. 3వ యూనిట్‌ నిర్మాణ పని G194 మీటర్ల దిగువన స్పైరల్‌ కేస్‌, పిట్‌లైనర్‌, బ్యారల్‌ కాంక్రీట్‌ తదితర నిర్మాణా దశలో వుంది.

ఈ పంపుహౌస్‌లో ప్రత్యేకత రెండు టన్నెల్స్‌ (ట్విన్‌ టన్నెల్స్‌) పక్కపక్కనే నిర్మితమవడం. వీటిని కుడి ఎడమ టన్నెల్స్‌గా పిుస్తుంటారు. 10.5 మీటర్ల వ్యాసంతో వీటిని తొలిచి నిర్మించారు. ఒక్కొక్కటి 4,133 మీటర్ల పొడవున వున్నాయి. వీటి లైనింగ్‌ తదితర పను కూడా పూర్తయ్యాయి.

ఈ పంప్‌హౌస్‌లో ఎక్ట్రో మెకానికల్‌ పను చాలా కీకమైనవి. ఒక్కొక్క మోటరుకు 139 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా కావాలి. అందుకు తగిన విధంగా విద్యుత్‌ సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 160 ఎంవిఎ సామర్ధ్యం కలిగిన పంపు ట్రాన్స్‌ఫార్మర్‌ నిర్మాణం 5వ యూనిట్‌కు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. అనుబంధంగా వుండే కంప్రెషర్‌ యూనిట్లను ఏర్పాటు చేశారు.

మరో ప్రధానమైన నిర్మాణం సర్జ్‌పూల్‌. పంపు చేయడానికి అవసరమైన నీరు సర్జ్‌పూల్‌కు చేరుతుంది. ఇక్కడ భారీ పరిమాణంలో నీరు వుండాలి. అందుకు తగిన విధంగా 3 సర్జ్‌పూల్స్‌ నిర్మించారు. 200I20I67.8 మీటర్ల పరిమాణంతో ప్రధాన సర్జ్‌పూల్‌ నిర్మాణం పూర్తయింది. అదనపు సర్జ్‌పూల్‌ నిర్మాణం 60I20I69.5 మీటర్ల సామర్ధ్యంతోను పూర్తి చేశారు. 2వ దశ పంపింగ్‌ స్టేషన్‌ నిర్మాణం 189.5 మీటర్ల దిగువన 115I25I64.75 మీటర్ల పరిమాణంతో పని జరుగుతోంది. ఎక్కడా లేని విధంగా 3 సర్జ్‌పూల్స్‌ ఈ పంప్‌హౌస్‌లో నిర్మించారు. అదే విధంగా ట్రాన్స్‌ఫార్మర్‌బేను కూడా ప్రత్యేకంగా కింది భాగంలో నిర్మించారు. పంపుహౌస్‌ దిగువభాగం.. అంటే నేభాగం గ్రౌండ్‌లెవెల్‌ నుంచి 330 మీటర్ల దిగువకు ఉండటం ఒక ప్రత్యేకత. వర్టికల్‌ పంపును 138 మీటర్ల దిగువన ఏర్పాటు చేయడం మరో ప్రత్యేకత. ప్రతి పంపు మోటారూ బరువు 2,376 మెట్రిక్‌ టన్ను ఉందంటే ప్రతీ యూనిట్‌ ఎంత పెద్దదో చెప్పాల్సిన పని లేదు.

ఇంత పరిమాణంతో భూమి అంతర్భాగాన్ని తొలిచి బయటకు తీయడమే కాకుండా అక్కడ పటిష్టమైన కాంక్రీటు భవంతిని నిర్మించి అందులో పంపు హౌస్‌ ఏర్పాటు చేయడం అత్యంత క్లిష్టమైన పని. ఇందులో సివిల్‌ పనుతో పాటు ఎక్ట్రో మెకానికల్‌ పను అత్యంత క్లిష్టమైనవి. మోటార్లకు సంబంధించిన విడిభాగాను అక్కడకు చేర్చి వాటిని ఒక్కటిగా అమర్చడమే కాకుండా మోటార్లు, పంపు అనుసంధానం చేసి, నీటిని 117 మీటర్ల ఎగువకు పంప్‌ చేయడం ప్రధానమైనది. ఈ తరహా ప్రాజెక్టు ప్రపంచంలో మరెక్కడా లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -