- Advertisement -
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది హీరోలకు సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి.అయితే చాలా తక్కువ మందికే సొంత ఫిల్మ్ స్టూడియోలు ఉన్నాయి.నాగేశ్వరరావు,కృష్ణ,రామానాయుడు ఇలా అతి తక్కువ మందికే సొంత ఫిల్మ్ స్టూడియోలు ఉన్నాయి.అయితే సొంత ఫిల్మ్ స్టూడియో నిర్మించే పనిలో ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్.
22 ఎకరాల్లో ఓ మెగా స్టూడియో నిర్మించాలని చరణ్ భావిస్తున్నాడట. ఇదే జరిగితే మెగా ఫ్యామిలీకి సొంత ఫిల్మ్ స్టూడియోతో పాటు చిరంజీవి తీరని కోరిక కూడా తీరినట్టే.రామ్ చరణ్ ఇప్పటికే కొణిదల ప్రొడక్షన్స్ ను స్థాపించి సినిమాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
