Thursday, May 2, 2024
- Advertisement -

4 రాష్ట్రాలు.. ఓ కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు

- Advertisement -

మళ్లీ ఎన్నికలకు దేశం రెడీ అవుతోంది. జరిగేది 4 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలే అయినా.. వాటి ఫలితాల ప్రభావం దేశ వ్యాప్తంగా రాజకీయాలపై పడనుండడంతో… ప్రజల్లో కూడా ఆసక్తి పెరుగుతోంది. తమిళనాడు, కేరళ లాంటి దక్షిణ భారత రాష్ట్రాలకు తోడు..

అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లోనూ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 4 నుంచి మే 16 వరకు 43 రోజుల వ్యవధిలో జరగనున్న ఈ ఎన్నికల్లో.. మొత్తం 824 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. దాదాపు 17 కోట్ల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు.

తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో మే 16న ఒకే దశలో పోలింగ్ పూర్తి కానుంది. అస్సాంలో ఏప్రిల్ 4, 11 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ ముగియనుంది. లెఫ్ట్ ప్రభావిత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మే 5 వరకు 6 దశల్లో పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఈ ఎన్నికలను కేంద్రంలో అధికార పార్టీ బీజేపీతో పాటు.. కాంగ్రెస్, ఇతర రీజనల్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు.. ప్రస్తుతం జరగనున్న 4 రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానుండడంతో.. అన్ని పార్టీలకు ఇవి అత్యంత కీలకంగా మారాయి.

అంతే కాక.. మరో మూడేళ్లలో పార్లమెంట్ కు ఎన్నికలు జరగనుండడంతో.. ఇప్పుడు జరిగే ఎన్నికల ప్రభావం కూడా అప్పటికి ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో.. జరిగేది రాష్ట్రాల ఎన్నికలైనా.. దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలతో పాటు.. చిన్నాచితకా పార్టీలన్నీ అప్పుడే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టేశాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -