Saturday, April 20, 2024
- Advertisement -

రాష్ట్రనికి మూడు రాజధానులైతే.. దేశానికి ఐదు రాధానులు !

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానులు కావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీకి రాజధానిగా ఉన్న అమరావతిని కాదని అభివృద్ది వికేంద్రీకరణ జరగాలంటే రాష్ట్రంలో మూడు రాజధానులు తప్పనిసరి అని జగన్ సర్కార్ పట్టు విడువకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ మూడు రాజధానులు ప్రస్తావనపై హైకోర్టులో స్టే నడుస్తోంది. ఇక కేంద్రం ఈ ప్రతిపాదనను మొదటి సమర్థించి ఇప్పుడు ఒకే రాజధాని ముద్దు అనే విధంగా ఏపీకి సూచిస్తోంది. అయితే ఈ విషయాన్ని కాస్త పక్కన పెడితే.. బిజెపి అధికారంలో ఉన్న అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

దేశంలో ప్రాంతీయ అసమానతలు తొలగిపోవాలంటే దేశానికి ఐదు రాజధానులు తప్పనిసరి అనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు అరవింద్ కేజ్రివాల్ పై విమర్శనాత్మకంగా చేయడం గమనార్హం. దేశ రాజధాని డిల్లీ కావడం వల్ల సంపద అంత ఒకే చోట పొగుపడడం జరుగుతోందని, అలా కాకుండా ప్రతి జోన్ కు ఒక రాజధానిని ఏర్పాటు చేస్తే దేశానికి మేలు చేకూరుతుందని, ఆ దిశగా అందరూ ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.దీంతో ఒక్కసారిగా ఈ అంశం చుట్టూ పోలిటికల్ హిట్ రాజుకుంది.

అది కూడా బీజేపీ ప్రభుత్వంలో ఉన్న అస్సాం ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడంతో.. కేంద్రం దృష్టిలో ఈ అయిదు రాజధానుల ప్రతిపాదన ఉందా ? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికీ ఏపీలోని మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ కు తీవ్రమైన వ్యతిరేకత ఎదురౌతున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు దేశానికే అయిదు రాజధానుల అంశం తెరపైకి రావడంతో.. ఈ అంశంపై కేంద్రం దృష్టి పెడుతుందా ? లేదా కేవలం విమర్శగానే మిగిలిపోతుందా ? అనేది చూడాలి.

Also Read

మోడీ ఆర్‌ఎస్‌ఎస్ కు దురమౌతున్నారా ?

టీడీపీ ఎన్డీయేలో చేరితే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

జగన్ మాస్టర్ ప్లాన్.. నిన్న కుప్పం నేడు మంగళగిరి ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -