బాహుబలి సినిమాలో నటించిన హీరో ప్రభాస్ విలన్‌గా రానా,దర్శకుడిగా రాజమౌళి ఎంతటి క్రేజ్ సంపాదించారో,అందులో శివగామిగా నటించిన రమ్యకృష్ణకు అంతకు మించి పేరు వచ్చింది. శివగామిగా రమ్యకృష్ణ పవర్ఫుల్ యాక్షన్ సినిమా హిట్‌కు చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు శివగామి పేరుతో ఓ వెబ్ సిరీస్ ప్రారంభిస్తున్నారు. ‘బాహుబలి’కి ప్రీక్వెల్ గా ‘శివగామి’ వెబ్ సిరీస్ ను 3 సీజన్లలో అందించనున్నారు.
ఇందుకోసం 375 కోట్లను కేటాయించినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే నటీనటుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు దేవ్ కట్టా దర్శకత్వం వహిస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి పర్యవేక్షణలో ఈ వెబ్ సిరీస్ కొనసాగుతుంది.రాజమౌళి ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్‌కు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా స్టోరీలో బిజిగా ఉన్నాడు రాజమౌళి.