Saturday, May 4, 2024
- Advertisement -

ప్రకాశం పంచాయతీ అట్టర్‌ఫ్లాప్….. వైకాపాలోకి టిడిపి సీనియర్ నేత

- Advertisement -

2004 ఎన్నికల ముందు వరకూ కూడా టిడిపిలో బాబు చెప్పిన మాటే వేదం. ఆ తర్వాత అధికారంలో లేనప్పుడు, 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేవరకూ కూడా అందరూ బాబు మాటకు కట్టుబడి ఉండేవారు. అయితే ఫిరాయింపు రాజకీయాలు షురూ చేసిన తర్వాత నుంచీ మాత్రం టిడిపి నాయకులందరూ బాబును బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టారు. వైకాపా ఎమ్మెల్యేలను అడ్డంగా కొనేస్తూ ఉన్నప్పుడే ఈ విషయంలో చంద్రబాబును హెచ్చరించాడు జగన్. ఈ ఫిరాయింపుల ప్రభావం అంతా ఎన్నికల ఏడాదిలో బాబుపై మామూలుగా ఉండదని చెప్పాడు. నా అనుభవం అంత వయసు లేదు జగన్‌కి అని అన్ని విషయాల్లోనూ జగన్ సలహాలను పెడచెవిన పెట్టినట్టుగానే ఈ విషయాన్ని కూడా పట్టించుకోలేదు చంద్రబాబు.

అయితే ఇప్పుడు మాత్రం అన్నీ జగన్ చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. అనంతపురం జిల్లాలో ఎక్కువ భాగం ఎమ్మెల్యే సీట్లు తాను చెప్పిన వాళ్ళకు ఇవ్వకపోతే పార్టీ ఘోరంగా ఓడిపోవడం ఖాయమని ఓవైపు జేసీ బెదిరిస్తున్నాడు. ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే వైకాపాలోకి పోతా అని ఎవి సుబ్బారెడ్డి బ్లాక్ మెయిల్ చే్స్తున్నాడు. ఇంకా గల్లా కుటుంబం నుంచి కూడా బాబు ప్రెషర్ ఉంది. ఇక అంతర్గతంగా కూడా లుకలుకలు ఓ స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ప్రకాశం జిల్లా టిడిపి సీనియర్ నాయకుడు కరణం బలరాం కూడా వైకాపాలో చేరడానికి రెడీ అవ్వడం జిల్లా టిడిపి కార్యకర్తలను విస్మయపరుస్తోంది.

అద్దంకి వైకాపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ని పార్టీలో చేర్చుకోవడంతో కరణం బలరాం ఇప్పుడు టిడిపిని వీడడానికి రెడీ అయ్యాడు. నిజానికి అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికంటే కరణం బలరాంకే బలం ఎక్కువ. గొట్టిపాటి రవికుమార్ చాలా జూనియర్. అయితే వైఎస్సార్ ఇమేజ్, జగన్ ప్రచారం కలిసొచ్చి ఎమ్మెల్యే అయిపోయాడు. రేపు 2019 ఎన్నికల్లో కరణం బలరాం వైకాపా తరపున ప్రత్యర్థిగా నిలబడితే మాత్రం గొట్టిపాటి రవికుమార్ ఘోరంగా ఓడిపోవడం ఖాయం అన్నది విశ్లేషకుల మాట. ఈ విశ్లేషణలు, సర్వే రిపోర్ట్సే ఇప్పుడు టిడిపి నాయకుల్లో ఆందోళన పెంచుతున్నాయి. కరణం బలరాం వైకాపాలో చేరకుండా చంద్రబాబు స్థాయిలో తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసేలా చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో కూడా ప్రకాశం జిల్లాలో వైకాపాదే పై చేయి. ఇప్పుడిక మాగుంట సుబ్బరామిరెడ్డి ఫ్యామిలీ, కరణం బలరాం లాంటి వాళ్ళు వైకాపాలో చేరితే జిల్లా స్థాయిలో వైకాపా పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శిస్తుందనడంలో సందేహం లేదన్న ఆందోళన టిడిపి నేతలు, శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -