చంద్రశేఖర్ యేలేటి టాలీవుడ్‌లో విభిన్న కథలను తెరకెక్కించడంలో ఆయన తరువాతే ఎవరైనా. ‘ఐతే’ .. ‘అనుకోకుండా ఒక రోజుస స ,మనమంతా, వంటి విభిన్న సినిమాలు తీసిన దర్శకుడు. అలాంటి చంద్రశేఖర్ యేలేటి మరో విలక్షణమైన కథను సిద్ధం చేసుకున్నాడు. అయితే ఈ సినిమాలో మొదట గోపిచంద్ హీరోగా అనుకున్నాడు,అయితే చంద్రశేఖర్ యేలేటి సినిమాలు బాగున్నప్పటికి కమర్షియల్‌గా హిట్ కావు.
ఈ కారణంతోనే గోపిచంద్ ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఆ తరువాత సాయిధరమ్ తేజ్ తోను చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. కారణమేదైనా ఆ తరువాత ఈ ప్రాజెక్టు వచ్చి నితిన్ దగ్గర ఆగింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అనుకుంటూ ఉండగా ఈ ప్రాజెక్టు నుంచి నితిన్ తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమాను నాని చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నానికి ఈ కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమచారం.దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.
